శాసనసభ అంటే ఎంత గౌరవప్రదమైన స్థానమో అందరికీ తెలిసిందే…ప్రజల కోసం పనిచేసే శాసనసభ..శాసనసభ్యులకు ఒక దేవాలయంతో సమానమని చెప్పొచ్చు. అలాంటి స్థానం ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందో తెలిసిందే…దూషణలు, బూతులకు అసెంబ్లీ వేదికగా మారిపోయింది. అసెంబ్లీ అంటే తిట్టుకోవడానికే అన్నట్లు అయిపోయింది..అందుకే అసెంబ్లీ అంటే ప్రజలకు గౌరవం తగ్గే పరిస్తితి వచ్చింది..ఆ పరిస్తితి తీసుకొచ్చింది నాయకులే అని చెప్పొచ్చు.

గత కొన్నేళ్లుగా ఏపీ అసెంబ్లీ బూతులకే వేదికగా మారింది…ఇక ఆ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి వైసీపీ ప్రజాప్రతినిధులు ఏ స్థాయిలో అసభ్యంగా మాట్లాడారో అందరికీ తెలిసిందే..ఆ తర్వాత బాబు కన్నీరు పెట్టడం, ఇంకా అసెంబ్లీకి వెళ్లనని, మళ్ళీ సీఎం అయ్యాకే అడుగుపెడతానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి..ఇక ఈ సమావేశాలకు బాబు ఎలాగో హాజరు కారు…అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.

ఈ అసెంబ్లీ గౌరవ సభ కాదు…. కౌరవ సభ అని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దానికి హాజరు కావడంలో అర్థం లేదని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగా ఇంతకాలంపాటు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం టీడీపీ చరిత్రలో ఇదే మొదటిసారి.

అయితే అసెంబ్లీని బహిష్కరించడం టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందా? అంటే ఏమో రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని చెప్పొచ్చు. గతంలో అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్…తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చెప్పి..సమావేశాలని పూర్తిగా బహిష్కరించి పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరాయి..2019 ఎన్నికల్లో అదిరిపోయే విజయం సాధించారు.

ఇప్పుడు బాబు కూడా అసెంబ్లీ తన భార్యని అవమానించారని చెప్పి…అసెంబ్లీకి దూరం జరిగారు..ఆయన బాటలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళుతున్నారు. ఇక అసెంబ్లీ బహిష్కరించి జనంలోకి వెళితే…టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పొచ్చు
.

Discussion about this post