March 22, 2023
సీబీఐ అధికారుల ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..
ap news latest AP Politics Politics

సీబీఐ అధికారుల ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి..

వైఎస్ వివేకా హత్య కేసు లో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసు లో కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్‌రెడ్డి హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణకు వచ్చారు. రూ.40 కోట్ల డీల్ వ్యవహారంపై అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే అవినాష్ రెడ్డితో పాటు వచ్చిన న్యాయవాదులను సీబీఐ అనుమతిస్తుందా? లేదా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. గతంలో విచారణ జరిగినప్పుడు న్యాయవాదులను అనమతించలేదు. వివేకా హత్యకేసులో అవినాష్ పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. ఆయనతోపాటు తండ్రి భాస్కర్‌రెడ్డి ప్రమేయానికి సంబంధించి ఓ అంచనాకు వచ్చింది. విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. పులివెందుల నుంచి వచ్చిన వైసీపీ వర్గీయులను వెనక్కి పంపిస్తున్నారు. దర్యాప్తు జరిగే పరిసరాల్లో ఆంక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఎంపీ రాక సందర్భంగా సీబీఐ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ కేసులో అవినాస్ రెడ్డిని తొలిసారి గతనెల 28వ తేదీన ప్రశ్నించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో సుదీర్ఘంగా ఈ విచారణ జరిగింది. అవినాశ్‌ రెడ్డి ‘కాల్‌ డేటా’ ఆధారంగా అప్పట్లో కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. వివేకా హత్య జరగడానికి ముందు, తర్వాత ఆయన రెండు నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించారు. జగన్‌తో మాట్లాడేందుకు ఆయన ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డి, జగన్‌ సతీమణి భారతీరెడ్డితో మాట్లాడేందుకు ఆమె వ్యక్తిగత సహాయకుడు నవీన్‌ నంబర్లకు కాల్‌ చేసినట్లువెల్లడైంది. దీని ఆధారంగా ఇప్పటికే కృష్ణమోహన్‌ రెడ్డి, నవీన్‌లను కూడా సీబీఐ ప్రశ్నించింది. వారిచ్చిన సమాచారం మేరకు.. అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఈ నెల 23న, అవినాశ్‌రెడ్డిని 24న విచారణకు రావాలంటూ సీబీఐ ఈ నెల 18న నోటీసులు ఇచ్చింది. అయితే… 23న హాజరు కాలేనని భాస్కర్‌రెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. అవినాశ్‌ రెడ్డి మాత్రం శుక్రవారం మరోసారి సీబీఐ ముందు హాజరయ్యారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video