బీజేపీలో నేతల మధ్య ఒక నాయకుడి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అది కూడా సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన నేత కావడం గమనార్హం. గతంలో టీడీపీలో ఉండి.. చక్రం తిప్పిన ఈయన ఇప్పుడు ఇక్కడ ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయనపై బీజేపీ నేతలు.. మంగళం శీను.. అంటూ.. కామెంట్లు కురిపిస్తున్నారు. జిల్లాలో ఏం జరిగినా.. ఆయన కనుసన్నల్లోనే సాగాలని.. ప్రతి ఒక్కరూ తనమాటే వినాలని ఆయన కోరుతున్నారట. అంతేకాదు.. రాష్ట్ర నాయకత్వంతోనూ తనకు సంబంధం లేదని.. చెబుతున్నారట. “కేంద్రంలోని బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరాను. నాకు కేంద్రంలోని పెద్దలు టచ్‌లో ఉన్నారు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారో.. కేంద్రానికి చెబుతాను.. తర్వాత మీ ఇష్టం!“ అని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారట.

దీంతో కడప జిల్లా బీజేపీ నాయకులు ఎవరికి వారు సైలెంట్‌గా ఉంటున్నారు. వాస్తవానికి సీమ జిల్లాల్లో పార్టీ బలంగా ఉందని.. ఇక్కడ పార్టీని గెలిపించుకునే అవకాశం కూడా ఉందని.. పార్టీ చీఫ్ సోము వీర్రాజు కేంద్రానికి సమాచారం పంపుతున్నారు. అయితే.. కడప జిల్లా బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అంతేకాదు.. పార్టీ తరఫున పోటీ చేసిన అబ్యర్థి పక్షాన ప్రచారం చేసేందుకు కూడా ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు.

అప్పట్లోనే దీనిపై అనుమానం వ్యక్తం చేసిన సోము వీర్రాజు.. అసలు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనిపై అప్పట్లో ఎవరూ మాట్లాడలేదు. అయితే.. ఇటీవల కొందరు `మంగళం శీను` మాదిరిగా ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడని.. ఆయన వల్లే.. తాము మాట్లాడలేక పోతున్నామని.. సోముకు ఫిర్యాదు చేశారట. దీంతో అగ్గిమీద గుగ్గిలం అయిన సోము వీర్రాజు.. మంగళం శీనుల ఆటపట్టిస్తాను.. కట్టడి చేస్తాను.. అని కామెంట్లు చేశారు. అంతేకాదు.. అసలు ఎవరీ మంగళం శీను.. అనే విషయాన్ని కూడా ఆయన ఆరా తీశారు. టీడీపీతో టచ్‌లో ఉండే నాయకుడిగా ఆయన గుర్తించారు.

అంతేకాదు.. కేంద్రంలోని బీజేపీ పెద్దలతోనూ నేరుగా సంబంధాలు పెట్టుకున్నారని తెలిసింది. అయినప్పటికీ.. ఇలా పార్టీని బలహీన పరచడం భావ్యం కాదని.. సోము భావిస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే తాను ఫిర్యాదు చేస్తానని ఆయన చెబుతున్నారు. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిపోయిందని అంటున్నారు పార్టీ నేతలు. ఎందుకంటే.. పార్టీ తరఫున వాయిస్ వినిపించాలంటే.. ఆయన అనుమతి తీసుకోవాల్సి వస్తోందని.. తనకంటూ.. ప్రత్యేకంగా ఒక వర్గాన్ని కూడా నియమించుకున్నారనివారు ఆరోపిస్తున్నారు.. దీంతో ఇప్పుడు సీమ బీజేపీ నేతల మధ్య మంగళం శీను వ్యవహారం చర్చగా మారింది.

Discussion about this post