నెక్స్ట్ ఎన్నికల్లో కొందరు సీనియర్లు…తమ వారసులని రంగంలోకి దింపాలని ఇప్పటినుంచే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ వారసులకు ఎలాగైనా సీటు దక్కించుకుని సత్తా చాటాలని సీనియర్లు ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సైతం….తన వారసుడు విజయ్‌కు సీటు దక్కించుకోవాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అయ్యన్నతో పాటు విజయ్ కూడా టీడీపీలో ఫుల్ యాక్టివ్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా విజయ్ సైతం…పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు.

ఇలా పార్టీ కోసం పనిచేస్తున్న విజయ్‌కు సీటు ఇప్పించుకోవాలని అయ్యన్న బాగానే ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనే సీటు దక్కించుకోవాలని చూశారు. కానీ చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని చెప్పడంతో అయ్యన్న వారసుడుకు సీటు దక్కలేదు. దీంతో అయ్యన్న మాత్రం పోటీ చేశారు. కానీ ఈ సారి మాత్రం తనతో పాటు తన వారసుడుని రంగంలోకి దింపాలని అయ్యన్న చూస్తున్నారు.

అయ్యన్న ఎలాగో నర్సీపట్నం అసెంబ్లీలో పోటీ చేస్తారు..ఇక విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సీటు ఇప్పుడు ఖాళీగానే ఉంది. గత ఎన్నికల్లో ఈ సీటులో ఆడారి ఆనందకుమార్ పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో అనకాపల్లిలో టీడీపీకి నాయకుడు లేరు. అయితే అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడుగా బుద్దా నాగజగదీశ్వరావు పనిచేస్తున్నారు. ఈయన కూడా పార్లమెంట్‌లో పోటీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అటు సీనియర్ నేత కొణతాల రామకృష్ణ సైతం టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయన టీడీపీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ సీటు అడిగే ఛాన్స్ ఉంది. గతంలో కొణతాల అనకాపల్లి ఎంపీగా పనిచేశారు. అయితే అయ్యన్న కూడా తన వారసుడుకు ఇదే సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. మరి అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు…అయ్యన్న వారసుడుకు ఎలాంటి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి.

Discussion about this post