ఒక్కసారిగా దారుణమైన పరాజయం..23 సీట్లకే పరిమితం..అటు ప్రత్యర్ధికి 151 సీట్లు..ఇంకా అధికారంలోకి వచ్చి బలవంతమైన శక్తిగా ఎదుగుతున్నారు. ఇక ప్రత్యర్ధి చేతిలో వరుసగా చావు దెబ్బలు, కక్ష సాధింపులు..దీంతో ఇంకా ఏపీలో తెలుగుదేశం కోలుకోలేదనే పరిస్తితి. ఇక ఆ పార్టీ అడ్రెస్ గల్లంతు అని ప్రత్యర్ధులు ఎగతాళి చేస్తూ వచ్చారు. చంద్రబాబు ముసలోడు అయిపోయారని, అటు లోకేష్‌కు సత్తా లేదని కామెంట్ చేశారు.
ఇంకా అధికారం తమదే కదా అని…అధికార బలం మొత్తం టిడిపిని అణిచివేయడంపైనే ఫోకస్ పెట్టారు..దీంతో టిడిపి నేతలు సైతం బయటకు రావడానికి భయపడిన పరిస్తితి. అయితే ఇదంతా ఓ రెండేళ్ల క్రితం వరకు జరిగిన కథ..అయితే ఆ కథని వైసీపీ ముసలోడు అంటున్న చంద్రబాబు, సత్తా లేదంటున్న లోకేష్ మార్చేశారు. వైసీపీ ఎంత అణిచివేయాలని చూస్తే అంతపైకి లేచారు. కార్యకర్తలకు, నేతలకు అండగా నిలబడ్డారు. కొందరు నేతల చేత బూతులు తిట్టించడం, ఫ్యామిలీని కూడా లాగి దారుణంగా మాట్లాడినా సరే బాబు నిలబడ్డారు. మళ్ళీ పార్టీని నిలబెట్టారు.

ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలపై పోరాటం చేశారు. జగన్ ప్రభుత్వ అరాచక విధానాలకు ధీటుగా సమాధానం చెప్పారు. అసలు బాబుని 40 ఏళ్లుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అలాంటిది బాబు వస్తే రోడ్లపైకి జనం భారీ ఎత్తున వస్తున్నారు. అంటే ప్రజల్లో మార్పు ఎంతవరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక లోకేష్ కు సత్తా లేదని ఎగతాళి చేశారు..మంగళగిరిలో ఓడిపోయారని అన్నారు. కానీ అక్కడ గెలిచే స్థాయికి వచ్చారు.
అలాగే పాదయాత్ర చేస్తూ ప్రజల్లో తిరుగుతూ, వారి మద్ధతు సంపాదిస్తున్నారు. ఇలా ఇద్దరు కష్టపడటం వల్ల టిడిపికి కొత్త ఊపు వచ్చింది. పార్టీ గెలుపు దిశగా వెళుతుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసిన, ఎన్ని అబద్దాలు ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు. మొత్తానికైతే బాబు-చినబాబు కలిసి..టిడిపిని అధికారం దిశగా తీసుకెళుతున్నారు.