కుప్పం అంటే చంద్రబాబు….చంద్రబాబు అంటే కుప్పం…ఇందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఏడు ఎన్నికలగా…అంటే 1989 నుంచి 2019 వరకు 30 ఏళ్లుగా కుప్పంలో బాబు సత్తా చాటుతూ వస్తున్నారు. సాధారణంగా ఏ నాయకుడైన…తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చూస్తారు. కానీ చంద్రబాబు అలా చేయలేదు…రెండుశాతం కూడా కమ్మ ఓట్లు లేని కుప్పం బరిలో వరుసగా ఏడు సార్లు గెలుస్తూ వచ్చారు.

అలాగే గెలుస్తూ వచ్చిన చంద్రబాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పంపై ఫోకస్ చేసి అక్కడ బాబుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాగే పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో బాబుకు చెక్ పెట్టి వైసీపీ జెండా ఎగిరేలా చేశారు. ఇటు కుప్పం మున్సిపాలిటీలో కూడా సత్తా చాటారు.

అయితే కుప్పంలో వైసీపీ ఎలా గెలిచిందో అందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా అధికార బలాన్ని ఉపయోగించి సక్సెస్ అయిందో తెలుసు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ ఇంకా పోరాడాల్సిన అవసరముంది. అలాగే టీడీపీలో కొన్ని మార్పులు జరగాలి. అక్కడ స్థానిక నాయకత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వారిని మార్చాలి.

అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు ఒక అంశంపై ఫోకస్ చేయాలి. ప్రతి ఎన్నికకు యువ ఓటర్లు పెరుగుతూ వస్తారు. అయితే ఆ ఓటర్లు చంద్రబాబు కంటే ప్రత్యర్ధుల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎప్పటినుంచో బాబు కుప్పంలో ఉన్నారు కాబట్టి…35 ఏళ్ల పైనే ఉన్న వారికి బాగా అవగాహన ఉంటుంది. కానీ కొత్తగా వచ్చే ఓటర్లకు బాబు గురించి అంత తెలుసుకోరు…వారు జగన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.

అందుకే రాను రాను వైసీపీకి ఓటింగ్ పెరుగుతుంది. కాబట్టి యువ ఓటర్లని బాబు ఆకర్షించే ప్రయత్నం చేయాలి. వారిని తనవైపుకు తిప్పుకోవాలి. ఈ అంశంపై బాబు ఎక్కువ ఫోకస్ చేసి ముందుకెళితే…మళ్ళీ కుప్పంలో భారీ మెజారిటీతో గెలవచ్చు…లేదంటే మళ్ళీ మెజారిటీ తగ్గుతుంది.

Discussion about this post