నలభై ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది….తెలంగాణలో ఎలాగో ఆ పార్టీ కనుమరుగైపోయింది….ఇక ఏపీలో దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇప్పటికే చాలా వరకు పార్టీ నష్టపోయింది…ఇంకా పార్టీ నష్టపోకుండా చూసుకోవాలి. పార్టీ నష్టపోకూడదంటే….నెక్స్ట్ ఎన్నికల్లో టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. 2014 ముందు 10 సంవత్సరాలు టిడిపి అధికారంలో లేకుండా పోయింది. ఆ పది ఏళ్లలో టిడిపి క్యాడర్ బాగా నష్టపోయింది. 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన క్యాడర్‌కు ఒరిగింది ఏమి లేదు.

అయితే మళ్ళీ ఐదేళ్లకు పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. పైగా వైసీపీ ధాటిగా టిడిపికి చుక్కలు కనబడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పార్టీ పరిస్తితి ఎలా తయారైందో చెప్పాల్సిన పని లేదు. మరి ఇలాంటి పరిస్తితుల నుంచి బయటపడాలంటే టిడిపి అధికారంలోకి రావాలి. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకోచ్చేందుకు చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇటు నాయకులు, కార్యకర్తలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాకపోతే కొందరు నాయకులు ఇంకా యాక్టివ్ కావాల్సి ఉంది. పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో టిడిపి బాగా పికప్ అవ్వాలి. అసలు ఆ జిల్లాల్లోనే వైసీపీ బాగా స్ట్రాంగ్‌గా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలని వైసీపీ ప్రయత్నిస్తుంది.

ఎలాగో తమకు పట్టున్న ప్రాంతం కాబట్టి, ఎక్కువ సీట్లు గెలిచేయొచ్చని చూస్తున్నారు. అయితే ఈ జిల్లాలపైనే చంద్రబాబు ఫోకస్ చేయాల్సిన అవసరముంది. గుంటూరు నుంచి పై వరకు వెళితే అంటే శ్రీకాకుళం వరకు టిడిపి కొంతవరకు మెరుగ్గానే ఉంది. పైగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఇంకా ప్లస్ అవుతుంది. కానీ ప్రకాశం నుంచి నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్. కాబట్టి ఈ జిల్లాలో కనీసం సగం సీట్లు అయిన గెలుచుకుంటే…నెక్స్ట్ టిడిపి అధికారంలోకి రావడం ఖాయం.

Discussion about this post