చాలాకాలం తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు తన మనసులో మాట బయటపెట్టారు. చిరంజీవి తనకు మంచి మిత్రుడు అని చెబుతూనే. తన వల్ల 2009 ఎన్నికల్లో అధికారానికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మధ్య సినిమా టిక్కెట్ల అంశంలో వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతున్న విషయం తెలిసిందే. పేదవాడు సినిమా చూడాలని చెప్పి టిక్కెట్ల ధరలని తగ్గించామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దాని వల్ల నష్టం జరుగుతుందని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడితే వారిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

అలాగే సినిమా వాళ్ళంతా కమ్మ వాళ్ళు అని, టీడీపీకి అనుకూలంగా ఉండేవారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, వైసీపీకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. సినిమా వాళ్లతో తగాదా వస్తే వాళ్లంతా టీడీపీ అంటూ పనికిమాలిన నిందలు వేస్తున్నారని, సినిమా వాళ్లంతా తమ పార్టీ వాళ్లా? అని ప్రశ్నించిన బాబు, 2009లో చిరంజీవి పార్టీ పెట్టి తమపై పోరాడలేదా? అని అడిగారు. ఆయన అప్పుడూ, ఇప్పుడూ తనకు మంచి మిత్రుడే అని, కానీ పార్టీ పెట్టారు, పోరాటం చేశారని అన్నారు.

అలాగే తాను ముఖ్యమంత్రిగా ఉండగానే తనకు వ్యతిరేకంగా సినిమా తీశారని, అంతా తమ వాళ్లయితే తనపై సినిమాలు ఎలా వస్తాయి? అని నిలదీశారు. వాస్తవానికి చూసుకుంటే బాబు లాజిక్ కరెక్టే…సినిమా వాళ్ళంతా టీడీపీ వాళ్ళు అయితే..బాబుకు వ్యతిరేకంగా సినిమాలు రావు…ఇక అప్పుడు తనకు వ్యతిరేకంగా సినిమా బాబు పెద్దగా పట్టించుకోలేదు.

ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా సినిమా తీస్తే పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అలాగే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం వల్ల టీడీపీ అధికారానికి దూరమైన మాట వాస్తవం. లేదంటే అప్పుడే టీడీపీ అధికారం లోకి వచ్చేది. అయినా సరే బాబు, చిరంజీవితో సన్నిహితంగానే ఉంటారు. కాబట్టి బాబు చెప్పే లాజిక్‌లు కరెక్ట్ అనే చెప్పొచ్చు.

Discussion about this post