రాజకీయాల్లో బలమైన నేతలు ఉంటేనే ఏ పార్టీ అయినా బలంగా ఉంటుంది…అలా కాకుండా వీక్ గా ఉండే నేతలు ఉంటే…పార్టీ కూడా వీక్ గా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్తితి ప్రతిపక్ష టీడీపీలో కూడా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలహీనమైన అభ్యర్ధులు ఉన్నారని చెప్పొచ్చు. ఇలా టీడీపీ నేతలు బలహీనంగా ఉండటం వల్ల..ప్రజా వ్యతిరేకత ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు సైతం స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. అదే టీడీపీలో కూడా బలమైన నేతలు ఉంటే…అప్పుడు వైసీపీకి ఇబ్బంది అవుతుంది.

అయితే బలహీనమైన అభ్యర్ధులు ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు అవసరమనే చెప్పాలి. టీడీపీకి బలహీనమైన అభ్యర్ధులు ఉన్న నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలోని గన్నవరం కూడా ఒకటి అని చెప్పొచ్చు. మొదట నుంచి గన్నవరం టీడీపీ కంచుకోట..కానీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో అక్కడ టీడీపీ వీక్ అయింది…ఇదే క్రమంలో బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్‌గా పెట్టారు. అసలే పార్టీ వీక్ అయింది అనుకుంటే…బచ్చుల వల్ల ఇంకా వీక్ అవుతుంది.


ఆయనకు గన్నవరంపై పెద్ద పట్టు రాలేదు..దీంతో వంశీకి తిరుగులేకుండా పోయింది..అయితే ఇక్కడ బచ్చులని సైడ్ చేసి బలమైన కమ్మ నేతని ఇంచార్జ్‌గా పెడితే బెటర్ అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అప్పుడే వంశీకి పోటీ ఇవ్వడానికి కుదురుతుందని లేదంటే గన్నవరంలో టీడీపీ ఇబ్బందికర పరిస్తితులు ఎదురుకొక తప్పదని అంటున్నారు. ఇక ఇదే పరిస్తితి నరసరావుపేటలో కనిపిస్తోంది…ఇది కూడా ఒకప్పుడు టీడీపీ కంచుకోటే…ఇక్కడ కోడెల శివప్రసాద్ వరుసగా అయిదుసార్లు గెలిచారు.


ఇక ఆయన సత్తెనపల్లి మారిపోయాక, నరసరావుపేటలో టీడీపీకి పట్టు లేకుండా పోయింది. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఇక ఇక్కడ టీడీపీ ఇంచార్జ్‌గా చదలవాడ అరవింద్ బాబు ఉన్నారు. అయితే గోపిరెడ్డి బలం ముందు చదలవాడ సరిపోవట్లేదు. ఇక ఇక్కడ బలమైన రెడ్డి నేతకు టీడీపీ టిక్కెట్ ఇస్తే బెటర్ అనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వస్తుంది. చూడాలి మరి ఈ రెండు చోట్ల అభ్యర్ధులని మారుస్తారేమో.

Discussion about this post