ఇంకా గుడివాడలో టీడీపీకి బలమైన అభ్యర్ధి కోసం వేట కొనసాగుతూనే ఉంది…బలమైన అభ్యర్ధి ఉంటేనే…బలంగా ఉన్న కొడాలి నానికి చెక్ పెట్టడం సులువు అవుతుందనే సంగతి తెలిసిందే..అయితే ఇప్పటికీ ఇంకా గుడివాడలో టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ కావడం లేదు. అసలు ఎప్పుడైతే కొడాలి నాని టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారో అప్పటినుంచి గుడివాడలో టీడీపీకి బలమైన నాయకుడు దొరకడం లేదు.

టీడీపీలో పూర్తిగా బలం పెంచుకుని నాని వైసీపీ వైపుకు వెళ్ళడం బాగా మైనస్ అయింది..ఇక నాని వెళ్ళాక రావి వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి నిలబెట్టిన ప్రయోజనం లేదు…2014లో నానిని నిలువరించడం కష్టమైంది..సరే రావి వల్ల కావడం లేదని 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్‌ని తీసుకొచ్చి నానిపై నిలబెట్టారు..ఆయన వల్ల కూడా కాలేదు. పైగా ఓడిపోయాక అవినాష్..వైసీపీలోకి వెళ్ళిపోయారు..దీంతో మళ్ళీ రావినే తీసుకొచ్చి గుడివాడ టీడీపీ ఇంచార్జ్‌గా పెట్టారు.


ఆయన ఏమో అధికారంలో ఉన్న కొడాలిని చూసి కాస్త వెనక్కి తగ్గుతున్నారు…నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయడం లేదు..దీంతో గుడివాడలో టీడీపీ పరిస్తితి దారుణంగా తయారైంది..సరే కొడాలికి చెక్ పెట్టడం రావి వల్ల కాదని అర్ధమైపోతుంది…ఈ క్రమంలోనే గుడివాడలో టీడీపీ తరుపున బలమైన నాయకుడుని నిలబెడతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే బాలయ్యని తీసుకొచ్చి గుడివాడలో నిలబెడతారని ప్రచారం వస్తుంది.

అయితే ఇది ప్రచారమే గాని ఇందులో నిజం కనబడటం లేదు..అసలు గుడివాడ సీటులో బాలయ్య పోటీ చేయడం అనే టాపిక్ టీడీపీ అధిష్టానం వద్ద లేదని తెలుస్తోంది. ఆయన మళ్ళీ హిందూపురంలోనే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరినైనా తీసుకొచ్చి గుడివాడలో నిలబెడతారనే ప్రచారం కూడా జరుగుతుంది…మరి ఇందులో ఎంత నిజముందో క్లారిటీ లేదు.

కాకపోతే ఈ మే నెలలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే…అప్పుడు నారా-నందమూరి ఫ్యామిలీలు ఏకమవ్వనున్నాయి..ఈ కార్యక్రమం తర్వాతే నందమూరి ఫ్యామిలీతో చర్చించి..గుడివాడలో అభ్యర్ధిని ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. చూడాలి మరి గుడివాడ బరిలో ఎవరు ఉంటారో.

Discussion about this post