కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది ప్రభుత్వాలు…అధికారంలో ఉన్న పార్టీలు. అయితే ప్రతిపక్ష పార్టీలు భరోసా ఇవ్వమని ఫైట్ చేస్తాయి. కానీ ఏపీలో ఏంటో మొత్తం సీన్ రివర్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు ప్రతిపక్ష పార్టీ భరోసా ఇస్తుంటే…అధికార పార్టీ ఏదో పైపైన పరామర్శ చేసినట్లు కనిపిస్తోంది. వరదల వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలు భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ ఏదో ఒకరోజు హెలిప్యాడ్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి సైడ్ అయిపోయారు.

అలాగే వరదల చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షలు, పాక్షికంగా ఇళ్లు దెబ్బతింటే రూ.5,200, పూర్తిగా దెబ్బతింటే రూ.95 వేలు ఇస్తామని చెప్పారు. అలాగే వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.2 వేలు ఇస్తామని అన్నారు. సరే మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఎంతవరకు సరిపోతుందా ఆలోచించాల్సిన అవసరముంది. అలాగే ఇళ్ళు దెబ్బతింటే ఇచ్చే సాయం కూడా చాలదు. ఇక వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు రూ.2 వేలు అంటే ఏం సరిపోతుంది.

అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం జనంలోకి వెళ్ళి భరోసా ఇచ్చారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలని పరామర్శించారు. ఇక పరామర్శతో చేతులో దులేపేసుకోకుండా…. తమ పార్టీ తరుపున వరదల వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 1లక్ష, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.5 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ సాయం ఏ మాత్రం సరిపోదనే చెప్పాలి.

కానీ ఒక ప్రతిపక్ష పార్టీ ఈ మేరకు సాయం చేస్తుందంటే మంచి విషయమనే చెప్పాలి. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్…ఇలాంటి భరోసా మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. ఇక ప్రతిపక్ష పార్టీనే ఇలా సాయం అందిస్తే…ప్రభుత్వం ఇంకా సాయం పెంచాలి…అలాగే అధికార పార్టీగా ఉన్న వైసీపీ కూడా….తమ పార్టీ తరుపున వరద బాధితులకు సాయం చేయాల్సిన అవసరముంది.

Discussion about this post