వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఆ పార్టీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం వైసీపీ దూకుడు ఉందని అంటున్నా.. ప్రజల్లో అంతర్గతంగా మాత్రం వైసీపీ పాలనపై తీవ్ర వ్యతి రేకత ఉందని.. నాయకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినా.. ప్రజలను ఏ విషయంపై కదిలించినా.. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని.. టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తమకు విజయం తథ్యమని వారు భావిస్తున్నారు.

ఈ క్రమంలో చాలా మంది నాయకులు యాక్టివ్ అయ్యారు. ఒకరిని మించి ఒకరు అన్న విధంగా దూసుకు పోతున్నారు. ఈ క్రమంలోనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే.. తెలుగు మహిళ అధ్యక్షురా లు.. వంగలపూడి అనిత కూడా తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ప్రత్యేకంగా చంద్రబాబు దృష్టిలో పడేలా ఆమె.. కార్యక్రమాలు ఉంటున్నాయని.. పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నిర్వహించిన కార్యక్రమం సహా.. రెండు మూడు కార్యక్రమాలు.. బాగానే సక్సెస్ అయ్యాయి.

అదేసమయంలో ఆమె వాయిస్ కూడా బలంగా వినిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను టీడీపీవైపు ఆకర్షిం చేలా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే అక్కడ ఉంటున్నారు. అధికార పార్టీ కన్నా దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నారు. ఫలితంగా.. గతానికి భిన్నంగా తెలుగు మహిళా విభాగాన్ని.. ముందుకు నడిపిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె అనుచరులు ఒక సంచలన చర్చ కు తెరదీశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగానే.. ఎస్సీ కోటాలో.. ఖచ్చితంగా మంత్రి పదవి అనితకు దక్కుతుందని అంటున్నారు.

వాస్తవానికి ఎవరు రాజకీయాల్లో ఉన్నా.. పదవులు ఆశించడం తప్పుకాదు. అసలు రాజకీయాల్లోకి వచ్చేది పరోక్షంగా పదవుల కోసమే. అయితే.. ఎవరికి దక్కుతందనేది మాత్రం.. చిత్రమే. అయితే.. ఇప్పుడు ఈ కోటాలో.. అనితదూకుడుగా ఉన్నారని టీడీపీలో చర్చ సాగుతోంది. వాస్తవానికి.. ఆమెకు ఇప్పుడు పార్టీలోనూ.. పోటీలేదు. ఎస్సీ నాయకురాళ్లు పపెద్దగా ఎవరూ ఎలివేట్ కావడం లేదు. సో… వచ్చే ఎన్నికల్లో మంత్రి దక్కినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post