టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిలో బాగా మార్పు వచ్చిందనే చెప్పాలి. గతానికి భిన్నంగా చంద్రబాబు పనిచేస్తూ ముందుకెళుతున్నారు. తను మారడంతో పాటు పార్టీలో కూడా మార్పులు చేస్తున్నారు. ఇలా మార్పులు రాకపోతే రాజకీయంగా నష్టపోవడం గ్యారెంటీ అని బాబుకు అర్ధమైనట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎంత ముఖ్యమో ఆయనకు బాగా తెలుసు. నెక్స్ట్ గానీ గెలవకపోతే జగన్, ఏవిధంగా టీడీపీని దెబ్బతీస్తారో కూడా తెలుసు. ఇప్పటికే నానా రకాలుగా టీడీపీని ఇబ్బంది పెట్టడానికి చూశారు.

కానీ ఎలాగోలా బాబు పార్టీని పైకి తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ కూడా ఓడిపోతే పార్టీ భవిష్యత్‌కే ప్రమాదం. అందుకే నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా లక్ష్యంతో బాబు ముందుకెళుతున్నారు. దానికి తగ్గట్టుగానే పార్టీలో మార్పులు చేస్తున్నారు. కేసులు అని, ఏదొక ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రభుత్వానికి భయపడే టీడీపీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. నియోజకవర్గంలో పార్టీని నడిపే బాధ్యతను తీసుకొన్న బాధ్యులు ఆ స్థాయిలో పనిచేయాలని, ఖచ్చితంగా ప్రజల్లో ఉండి వారి సమస్యలపై పోరాడాలని, ఆ శక్తి లేదనుకొన్న వారు, వైసీపీకి భయపడేవారు స్వచ్ఛందంగా తప్పుకోండని సూచించారు.

అలాగే వారికి గౌరవం తగ్గకుండా ఇతరత్రా బాధ్యతలు, అవకాశాలు ఇస్తామని, ఇంకా వారి స్థానంలో కొత్తవారిని ముందుకు తెస్తామని అన్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు పలు స్థానాల్లో ఇంచార్జ్‌లని మార్చేశారు. పనిచేయని నాయకులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో మరింత మందిని సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా కొంతమంది ఇంచార్జ్‌లు పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు.

ఏదో మొక్కుబడిగానే నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇక అలాంటి వారిని పక్కన పెట్టడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఈ విషయంలో బాబు ఏ మాత్రం మొహమాట పడేలా కనిపించడం లేదు. పార్టీకి నష్టం జరుగుతుందనుకుంటే సీనియర్లని సైతం సైడ్ చేయడానికి బాబు వెనుకాడరని తెలుస్తోంది. మొత్తానికైతే టీడీపీలో బాబు భారీ మార్పులు తీసుకొచ్చేలా ఉన్నారు.

Discussion about this post