గత ఎన్నికల తర్వాత పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయిందనే చెప్పాలి. దాదాపు చాలా స్థానాల్లో ఓడిపోయిన తర్వాత నేతలు పార్టీలు మారిపోవడం గానీ, సైలెంట్ అయిపోవడం గానీ జరిగాయి. దీంతో చాలా స్థానాల్లో టీడీపీకి నాయకులు లేరు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో గెలవడంతో పాటు పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలవడం చాలా ముఖ్యం. కేంద్రంలో కీలకంగా ఉండాలంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాల్సి ఉంది.

కాబట్టి ఇప్పటినుంచే పార్లమెంట్ స్థానాలపై కూడా ఫోకస్ చేయాల్సిన అవసరముంది. ఆయా స్థానాల్లో బలమైన నాయకులకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఇప్పటికే పలు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకంగా ఉన్న ఏలూరు పార్లమెంట్ స్థానంలో టీడీపీకి నాయకులు లేరు. గత కొన్నేళ్లుగా ఏలూరు పార్లమెంట్ స్థానంలో మాగంటి బాబు టీడీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. 2009లో ఓడిపోయిన ఆయన 2014లో గెలిచారు.

మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయాక బాబు పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. పైగా ఇటీవల ఆయన ఇద్దరు కుమారులు మరణించడంతో రాజకీయాల వైపు చూడటం లేదు. ఆయన మళ్ళీ ఏలూరులో పోటీ చేసే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ మాగంటి యాక్టివ్ అయితే ఏలూరు సీటు ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన తప్పుకుంటే వేరే నాయకుడుని ఏలూరు బరిలో పెట్టాల్సిన అవసరముంది.

అయితే ఏలూరు పార్లమెంట్ బరిలో దివంగత బోళ్ళ బుల్లిరామయ్య మనవడు రాజీవ్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన వైసీపీలోకి వెళ్తారని కూడా ఎప్పటినుంచో ప్రచారం వస్తుంది. దీంతో ఏలూరు పార్లమెంట్‌లో టీడీపీకి దిక్కు ఎవరు అనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. పైగా ఏలూరు బరిలో ఎవరిని దింపిన సరే…అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్‌కు చెక్ పెట్టడం అంత సులువు కాదని తెలుస్తోంది.

Discussion about this post