తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అధినేత చంద్రబాబు నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయి నేతలు ఎక్కడకక్కడ జారిపోయారు..కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు..మరోవైపు అధికార వైసీపీ ఏ స్థాయిలో టిడిపిని టార్గెట్ చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక పంచాయితీ, పరిషత్, మున్సిపల్..ఇలా ప్రతి ఎన్నికల్లో దారుణమైన ఓటమి. ఇలాంటి పరిస్తితులు ఉన్నా సరే చంద్రబాబు స్ట్రాంగ్ గా నిలబడి..మళ్ళీ పార్టీని గాడిలో పెట్టి…వైసీపీకి ధీటుగా నిలబెట్టారు.

నెక్స్ట్ ఎన్నికల్లో ఇంకా వైసీపీకి చెక్ పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా పనిచేస్తున్నారు. ఓ వైపు ప్రతి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూనే..మరోవైపు ప్రజల్లో ఉంటూ ప్రజా మద్ధతు పెంచుకునే దిశగా పనిచేస్తున్నారు. రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. బాబు సభలకు జనం నుంచి స్పందన కూడా భారీగానే వస్తుంది. ఇక కందుకూరు, గుంటూరు లాంటి ఘటనలు కాస్త మనో ధైర్యాన్ని దెబ్బతీసిన మళ్ళీ పికప్ అయ్యి..తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరిలో పర్యటిస్తున్నారు. జగ్గంపేట రోడ్ షోకు ప్రజా స్పందన బాగా వచ్చింది.

ఇటు వైపు బాబు పనిచేస్తుంటే..అటు వైపు లోకేష్ పాదయాత్రతో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. ప్రజలని కలుసుకుంటూ..ప్రజా సమస్యలని తెలుసుకుంటున్నారు. వైసీపీ నేతల అక్రమాలని ఎండగడుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైన లోకేష్ వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు.

ఇలా ఓ వైపు చంద్రబాబు, మరో వైపు లోకేష్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. వారికి నేతల కష్టం కూడా తోడైతే..వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం సులువు అవుతుంది.

