రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో కాస్త విచిత్రమైన పరిస్తితులు ఉన్నాయనే చెప్పొచ్చు…వాస్తవానికి ఎక్కడకక్కడ అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది…కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని కొందరు టీడీపీ నేతలే బలపడుతున్నారని చెప్పొచ్చు…కొన్ని చోట్ల టీడీపీ నేతలు…వైసీపీపై ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు…ఫలితంగా టీడీపీ పూర్తిగా ఆధిపత్యం దక్కించుకునే స్థితికి రావడం లేదు. అయితే అలాంటి నియోజకవర్గాలపై బాబు స్పెషల్ గా ఫోకస్ చేసి, పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉంటుంది.

ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న గన్నవరంలో కూడా పార్టీని లైన్ లో పెట్టాలి. మొదట నుంచి గన్నవరం టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే…అయితే గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు…దీంతో గన్నవరంలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్ గా తీసుకొచ్చారు. కానీ అర్జునుడు బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.

వాస్తవానికి వంశీతో పాటు కొంత టీడీపీ క్యాడర్ వైసీపీ వైపుకు వెళ్లింది…అదే సమయంలో వంశీ వైసీపీ వైపుకు వెళ్ళాక…అక్కడ రగడ మొదలైంది…నిజమైన వైసీపీ కార్యకర్తలు వంశీని వ్యతిరేకిస్తున్నారు…అలాగే ఆ పార్టీ నాయకులైన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు లాంటి వారు సైతం..వంశీకి యాంటీగా ఉన్నారు…నెక్స్ట్ వైసీపీ టికెట్ వంశీకి ఇస్తే ఓడిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు.

అంటే వైసీపీలో ఎంత రచ్చ ఉందో అర్ధం చేసుకోవచ్చు…పైగా ప్రజల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత ఉంది..కానీ దీన్ని క్యాష్ చేసుకుని టీడీపీని బలోపేతం చేయడంలో అర్జునుడు సక్సెస్ అవుతున్నట్లు కనిపించడం లేదు. కాబట్టి ఆయన మరింత యాక్టివ్ గా పనిచేయాల్సి ఉంది…నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరగాల్సి ఉంది..ఒకవేళ అర్జునుడుకు ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి…ఆయన స్థానంలో వేరే బలమైన నాయకుడుని పెడితే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది…లేదంటే గన్నవరం స్థానాన్ని టీడీపీ కోల్పోవాల్సి వస్తుంది.
Discussion about this post