ఆయన వల్ల పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆయనతో పార్టీ ఏమైనా.. బలోపేతం అవుతోందా? లేక.. ఆయన వల్ల పార్టీ నానాటికీ భ్రష్టు పడుతోందా? ఆయన వల్ల.. పార్టీ నామరూపాలు కోల్పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. ముఖ్యంగా యువ నాయకులు.. పార్టీ కోలుకోవాలని.. అధికారంలోకి రావాలని కోరుకునేవారు.. కూడా ఇది నిజమేనని అంటున్నా రు. భూమి పుట్టినప్పటి నుంచి అన్నట్టుగా ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నానని చెబుతారు. ఎన్టీ ఆర్ హయాం నుంచి కూడా తాను పనిచేస్తున్నానని.. చెబుతారు. కానీ, ఏం టిప్రయోజనం? అంటే.. పార్టీని అవసరాలకు వాడుకుని.. తన పొట్ట నింపుకునేందుకు తప్ప.. మరి దేనికీ కాదని.. పెదవి విరుస్తున్నారు పార్టీ సీనియర్లు. ఆయనే టీడీపీ సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి.. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు.. యనమల రామకృష్ణుడు.

యనమల రామకృష్ణుడు.. పార్టీ కి సీనియరే! కానీ, ఆయన ఆ సీనియార్టీకి తగిన విధంగా ప్రవర్తిస్తున్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాను వరుసగా తూర్పు గోదావరి జిల్లా తునిలో గెలిచింది వాస్తవమే. అయితే.. తాను తప్ప.. తన కుటుంబం తప్ప.. ఎవరూ ఎదకూడదనే కుశ్చిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. తునిలో కొన్నాళ్ల పాటు యనమల హవా నడించింది. అయితే.. తర్వాత.. పరిస్థితి ఏంటి? ఆయన తర్వాత.. ఆయన సొదరుడు కృష్ణుడు రంగ ప్రవేశం చేసినా.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అంటే.. ప్రజలు యనమల ఫ్యామిలీని ఛీ కొడుతున్నారనే కదా.. కొత్త రక్తాన్ని కోరుకుంటున్నారనే కదా! నియోజకవర్గంలో యనమల కుటుంబంపై ఇంత క్లారిటీ ఉన్నప్పటికీ.. ఇప్పటికీ.. నియోజకవర్గాన్ని బంక మాదిరిగా పట్టుకుని వేలాడుతున్నారనే విమర్శలు.. తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.

పార్టీలో కొత్త రక్తం ఎక్కిస్తానని పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. మరి.. ఇన్నాళ్లు పదవులు అనుభవిం చాం.. మరి ఇప్పుడైనా.. యువతకు అవకాశం ఇవ్వాలనే స్పృహ ఏమాత్రం లేకుండా.. యనమల వ్యవహరిస్తుండడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆయన ఒక్కరే ఎదగాలి.. ఆయన కుటుంబానికే పదవులు దక్కాలి.. అనే ధోరణితో ఆయన ముందు కు సాగుతున్నారు. ఏ ఒక్క యువ నాయకుడిని ఆయన ఎదగ నివ్వడం లేదు. ఏ ఒక్క రికీ అవకాశం రాకుండా చేస్తున్నారు. ఎవరి గళం వినిపించకుండా.. వ్యవహరిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రజలు రాను రాను టీడీపీకి దూరమవుతున్నారు.

ఇంకా చెప్పాలంటే జిల్లాలో ఎవరైనా కొత్త నేతలు ఏ నియోజకవర్గంలో అయినా రావాలంటే ముందుగా యనమల దర్శనం చేసుకుని.. కప్పం కట్టాల్సిందే ? అన్న విమర్శలు కూడా జిల్లా పార్టీలో ఉన్నాయి. మరి ఇది.. ఒక సీనియర్‌గా.. పార్టీకి ఆయన మేలు చేస్తున్నారా? లేక తిన్నింటి వాసాలనే లెక్కపెడుతున్నారా? తనకు రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చిన పార్టీని పాతాళానికి తొక్కేస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తునిలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా.. ఇలాంటి కురువృద్ధులు.. పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేనివారు.. కేవలం పదవుల కోసం.. పార్టీని పట్టుకుని వేలాడేవారు.. అవసరమా? ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి.. వ్యర్థ నాయకులను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు తుని ప్రజలు. లేక పోతే.. పార్టీ పుంజుకోవడం.. గెలుపు గుర్రం ఎక్కడం.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోతుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post