ఏపీ మాజీ సీఎం. టీడీపీ అధినేత చంద్రబాబు గ్రాఫ్ పెరిగిందా? ఆయనకు మెజారిటీ ప్రజలు పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ పాలన ప్రారంభించి రెండున్నరేళ్లు అయింది. ఈ క్రమంలో జాతీయ మీడియా ఇటీవల కొన్ని కథనాలు ప్రచారం చేసింది. వాటిలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సీఎంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వంటివి ప్రధానంగా చర్చకు వచ్చాయి. అయితే.. దీనిలోనూ జగన్‌కు మార్కులు పడకపోవడం గమనార్హం. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ఆయన చేస్తున్న సేవలు అందుతున్నాయి తప్ప.. ఇప్పటికీ మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

అదే సమయంలో కొన్ని సామాజికవ ర్గాలకు న్యాయం జరగడం లేదు. ఇటీవలే క్రిస్టియన్ మైనార్టీ.. నేత లు.. జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. తాము ఎన్నో ఆశలతో జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చామని,. కానీ, ఆయన తమకు ఏం చేశారని వారు ప్రశ్నించారు. ఇక, తాజాగా యాదవ సామాజిక వర్గం కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకరిద్దరికి మంత్రి పదవులు ఇస్తే.. సరిపోతుందా? తమను పట్టించుకోవాలి! అంటూ.. నిరసన స్వరం వినిపించారు. ఇక, సొంత సామాజిక వర్గం రెడ్లలోనూ జగన్‌పై అసంతృప్తి పెరుగు తోంది.

ఎందుకంటే.. ఈ మాత్రం సాయం.. అంటే.. జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చేస్తున్న సేవ.. గతంలో చంద్రబాబు హయాంలోనూ జరిగిందని వారు అంటున్నారు. అంతకు మించి.. తమకు ఏదో చేస్తారని.. జగన్‌పై ఆశలు పెట్టుకున్నామని.. కానీఆయనతమకు ఏం చేస్తున్నారనేది రెడ్డి వర్గం ప్రశ్న. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో తమకు కొన్ని కాంట్రాక్టులు దక్కాయని.. ఇప్పుడు అది కూడా తమకు దక్కడం లేదని.. పోనీ.. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా రెడ్డి వర్గానికి మద్దతు లభించడం లేదని.. వారుపేర్కొంటున్నారు.

దీంతో ఈ వర్గంలోనూఅసంతృప్తి పెరుగుతోంది. మరోవైపు.. రేషన్ కార్డుల్లో కోత.. కరెంటు బిల్లుల పెంపు.. వంటివి కూడా జగన్‌కు సెగ పెడుతున్నాయి. ఈ పరిణామాలతో పోల్చుకుంటే.. చంద్రబాబు హయాంలో అయితే.. ఇనవ్నీ లేవుఆ అనే మాట వినిపిస్తుండడం గమనార్హం. అందుకే ఆయనకు అనూహ్యంగా గ్రాఫ్ పెరుగుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఓ వెబ్ ఛానెల్ నిర్వహించిన సర్వేలోనూ చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం.

Discussion about this post