ఇటీవల ఏపీ రాజకీయాల్లో నారా భువనేశ్వరి గురించి ఎలాంటి చర్చలు నడిచాయో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ వేదికగా ఆమె గురించి వైసీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కూడా తెలిసిందే. అంతకముందు వల్లభనేని వంశీ ఏ విధంగా మాట్లాడారనే విషయం అంతా చూశారు. అలాగే తన భార్య భువనేశ్వరి గురించి చంద్రబాబు కన్నీరు పెట్టడం…నందమూరి ఫ్యామిలీ మొత్తం బయటకొచ్చి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వడం…అలాగే ఇతర పార్టీలు వారు కూడా వైసీపీ నేతల తీరుని ఖండించిన విషయం తెలిసిందే.

అయితే భార్యని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, తాము భువనేశ్వరిని ఏమి అనలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ వారు ఏం మాట్లాడారనే విషయం మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. అందుకే ఆ విషయాన్ని కవర్ చేసుకునేందుకు వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. భార్య ద్వారా సానుభూతి పొంది..రాజకీయంగా లబ్ది పొందాలని బాబు చూస్తున్నారని మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ అంశంపై భువనేశ్వరి డైరక్ట్‌గా స్పందించారు. తనను అవమానించిన వాళ్లు… వాళ్ల పాపాన వాళ్లే పోతారని, వాళ్లు వచ్చి సారీ చెబుతారని తానేమీ ఎదురు చూడటం లేదని, ఆ విషయాల గురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేయడం తనకు ఇష్టం లేదన్నారు. ఎవరైనా సరే మహిళల్ని గౌరవించాలని, నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అయితే ఆమె పరోక్షంగా వైసీపీ నేతలకు చురకలు అంటించారనే చెప్పాలి.

ఇక ఇంతటితో ఈ సమస్య సద్దుమనిగిందనే చెప్పాలి. కానీ ఇక్కడే వైసీపీ రాజకీయంగా ఆలోచిస్తుంది. చంద్రబాబు తన పని అయిపోవడంతోనే భార్యని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం మొదలుపెట్టారని మాట్లాడుతున్నారు. పైగా 2024 ఎన్నికల్లో ప్రచారం చేస్తారని బ్లూ మీడియా హడావిడి చేస్తుంది. అసలు భువనేశ్వరి ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. అంత అవసరం కూడా లేదు. కానీ ఇందులో కూడా వైసీపీ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Discussion about this post