సభ సాయంత్రం 6 గంటలకు..కానీ మొదలైంది..రాత్రి 11 గంటలకు..అయినా జనం నిలబడ్డారు..సభ అయ్యేవరకు ఉన్నారు. అయితే ఇదంతా బుధవారం మచిలీపట్నంలో చంద్రబాబు కోసం నిలబడిన జనం గురించి. ఇప్పటికే బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ బాబు జిల్లాల పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బాబు ఎక్కడకు వెళితే అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. రోడ్ షోలు, సభలకు భారీగా జనం వస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా బాబు బందరుకు వచ్చారు. మామూలుగా విజయవాడ టూ బందరు రావడానికి 2 గంటల సమయం పడుతుంది. రోడ్ షో కాబట్టి జనం వస్తారు కాబట్టి 4 గంటల సమయం పడుతుంది అని అనుకోవచ్చు..కానీ బాబు రోడ్ షోకు 8 గంటల సమయం పట్టింది. అంటే స్థాయిలో ప్రజలు బాబు కోసం రోడ్లపైకి వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఇక రాత్రి 9 గంటలకు బందరులో ఎంట్రీ ఇస్తే..సభ జరిగే ప్రాంగణానికి చేరుకోవడానికి రాత్రి 11 అయింది. అంటే బందరు ప్రజలు బాబు కోసం ఎలా నిలబడ్డారో అర్ధం చేసుకోవచ్చు.

రాత్రి 11 అయిన సభా ప్రాంగణంలో ప్రజలు ఉండిపోయారు. బాబు స్పీచ్ అయ్యే వరకు నిలబడ్డారు. దీని బట్టి చూస్తే బాబు కోసం ప్రజలు నిలబడటం మొదలైందని చెప్పవచ్చు. అలాగే వైసీపీపై వ్యతిరేకత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడు వెటకారంగా మాట్లాడే బందరు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అర్ధమైంది.
ఈ సారి ఆయన గెలవడం అసాధ్యమనే పరిస్తితి వచ్చింది. ఆయన ఎలాగో నెక్స్ట్ నిలబడను తప్పుకుంటానని అంటున్నారు. ఇక ఆయన తనయుడు పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక ఎవరు పోటీ చేసిన బందరులో టిడిపి జెండానే ఎగిరేలా ఉంది.
