ఏదేమైనా ఈ మధ్య చంద్రబాబులో మార్పు వచ్చిందనే చెప్పాలి. గతంలో మాదిరిగా ఆయన లేరు…ఈ విషయంలోనైనా ముక్కుసూటిగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొన్ని మార్పులు రావాలని చంద్రబాబు గ్రహించారు. ఆయన మారుతూ…పార్టీలో కూడా కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పనిచేయని నాయకులని సైడ్ చేసేస్తున్నారు. ఏదో మొహమాట పడుతూ ఉండటం లేదు. అలాగే పదవుల కోసం కాక పట్టే నాయకులని కూడా పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం పనిచేసే నాయకులకే ప్రాధాన్యత ఇవ్వడానికి చూస్తున్నారు.

పైగా గత ఎన్నికల్లో టీడీపీకి దూరమైన వర్గాలని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలాగే టీడీపీకి పెద్దగా మద్ధతు ఇవ్వని కొన్ని వర్గాలని తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ముస్లిం ఓటర్లని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట నుంచి ముస్లింలు టీడీపీకి అంతగా సపోర్ట్ ఉండరు. ఎందుకంటే ఎక్కువసార్లు టీడీపీ బీజేపీతో కలిసి ముందుకెళ్లింది. పైగా అటు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అండగా ఉండేది. అందుకే వారు ఎక్కువగా కాంగ్రెస్‌కే మద్ధతుగా నిలిచేవారు.

ఆ తర్వాత నుంచి వైసీపీకి మద్ధతుగా నిలుస్తూ వస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ముస్లింలు పూర్తిగా వైసీపీ వైపే నిలిచారు. అయితే ఇప్పుడుప్పుడే జగన్ పాలనలో తమకు ఒరిగేది ఏమి లేదని ముస్లిం ఓటర్లకు అర్ధమవుతున్నట్లు ఉంది. పైగా జగన్ ప్రభుత్వంలో పలువురు ముస్లింలు వేధింపులకు గురయ్యారు. ఈ క్రమంలోనే వారికి టీడీపీ అండగా నిలబడే ప్రయత్నాలు చేసింది.

దీంతో ముస్లిం ఓటర్లలో కాస్త మార్పులు వస్తున్నాయి. తాజాగా కూడా అనంతపురం జిల్లాకు చెందిన విశ్రాంత ఐపీఎస్ అధికారి శేక్షావలి తన సతీమణి ఆశా బేగంతో కలిసి టీడీపీలో చేరారు. ఈయనతో పాటు పలువురు నేతలు టీడీపీ చేరారు. అయితే పార్టీలో మైనారిటీ వర్గానికి ప్రాధాన్యత పెంచితే..ఇంకా మద్ధతు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వారిని ఇంకా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తే టీడీపీకే బెనిఫిట్.

Discussion about this post