May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

బాబు-లోకేష్ కష్టం..తమ్ముళ్ళ పంచాయితీలు..!

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ఇటు చంద్రబాబు, అటు నారా లోకేష్ కష్టపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి గత ఎన్నికల్లో దారుణ పరాజయానికి, ఆ తర్వాత వైసీపీ చేసిన రాజకీయాలని టి‌డి‌పి కోలుకోలేదని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ బాబు పైకి లేవడం మొదలుపెట్టారు. అధికార వైసీపీకి ధీటుగా పనిచేయడం మొదలుపెట్టారు.

టి‌డి‌పి నేతలపై కేసులు, అరెస్టులు అయినా సరే వారికి అండగా నిలబడి..పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు..మళ్ళీ వారిని ప్రజల్లోకి తీసుకొచ్చారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. అలా అలా టి‌డి‌పి దూకుడు పెంచారు. ఇప్పుడు టి‌డి‌పి..వైసీపీకి ధీటుగా ఎదగడం కోసం బాబు బాగా కష్టపడ్డారు. ఆధిక్యం దిశగా తీసుకెళ్ళేందుకు కష్టపడ్డారు. ఇలా తనదైన శైలిలో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టారు. ఓ వైపు పార్టీని లైన్ లో పెడుతూనే..మరోవైపు ప్రజల్లో ఉంటూ.. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకెళుతున్నారు

.

ఇక బాబుకు సపోర్ట్ గా నారా లోకేష్ పనిచేస్తున్నారు. పాదయాత్ర మొదలుపెట్టి పార్టీకి మరింత ఊపు తీసుకొచ్చారు. టి‌డి‌పికి ప్రజా మద్దతు మరింత పెరిగేలా చేశారు. ఇలా బాబు, లోకేష్ పార్టీ కోసం కష్టపడుతున్నారు. కొందరు నేతలు పార్టీకి అండగా నిలబడుతున్నారు. అయితే కొందరు నేతలు ఇవేమీ లేకుండా..ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. కొన్ని స్థానాల్లో సీట్ల విషయంలో రచ్చకు దిగుతున్నారు.

అసలు నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు ముఖ్యమనే విషయం మరిచిపోయి..సీటు కోసం పోటీ పడుతున్నారు. సీట్లు ఇచ్చేది చంద్రబాబు…ఆయన సీటు ఎవరికిస్తే వారికి అందరూ సహకరించేలా ఉండాలి. అలా కాకుండా తమకు సీటు దక్కలేదని చూస్తూ కూర్చుంటే టి‌డి‌పికే నష్టం. కాబట్టి ఇకనైనా తమ్ముళ్ళు పంచాయితీలు ఆపేసి..పార్టీ కోసం కష్టపడితే బెటర్.