గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి త్వరగానే పార్టీని బయటకు తీసుకొచ్చి, పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ..పార్టీ బలం పెంచడంలో చంద్రబాబు కష్టం చాలా ఉంది. ఇక టిడిపి పని అయిపోయిందనే దగ్గర నుంచి…ఇంకా నెక్స్ట్ టిడిపిదే అధికారమనే పరిస్తితికి తీసుకొచ్చారు. అయితే టిడిపి బలం ఇంకా పెరగాల్సి ఉంది. అప్పుడే టిడిపికి అధికారం దక్కుతుంది. కానీ కొన్ని చోట్ల టిడిపి నేతలు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడంలో విఫలమవుతున్నారు.

ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో టిడిపి నేతలు పికప్ అవ్వడం లేదు. ఆఖరికి జగన్ సొంత జిల్లా కడపలోనే టిడిపి బలపడుతుంది. కానీ నెల్లూరులో బలపడే ఛాన్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోవడంలో టిడిపి నేతలు ఫెయిల్ అవుతున్నారు. ఇక్కడ పదికి పది సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అందులో సగం మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. అయినా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడలేకపోతున్నారు.

ఉదాహరణకు గూడూరులో ఎమ్మెలే వరప్రసాద్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇక్కడ సొంత పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్తితి ఉంది. అలాంటి చోట టిడిపి గెలుపు ఈజీ. కానీ గూడూరులో ఆ పరిస్తితి లేదు. ఇక్కడ టిడిపికి అనుకున్నంత పాజిటివ్ కనిపించడం లేదు. ఇటు ఉదయగిరిలో వైసీపీకి అనుకూలత లేదు. కానీ ఇక్కడ టిడిపి పరిస్తితి అంతే. కావలి, నెల్లూరు సిటీ లాంటి నియోజకవర్గాల్లో అదే పరిస్తితి కనిపిస్తుంది. టిడిపి నేతలు ఇక్కడ హార్డ్ వర్క్ చేయాలి.

పైగా ఇక్కడ కొందరు ఇంచార్జ్‌లని మార్చేయాలని, కొందరు నేతలు వైసీపీతో అంటకాగుతూ టిడిపిని దెబ్బతీస్తున్నారని అలాంటి వారిని పక్కన పెట్టాలని చంద్రబాబు..నెల్లూరు టిడిపి శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి నెల్లూరులో టిడిపిని ప్రక్షాళన చేస్తారో లేదో చూడాలి.
