గోదావరి జిల్లాలు..ఈ జిల్లాల్లో రాజకీయంగా పట్టు సాధించిన వారు..రాష్ట్ర రాజకీయాలపై కూడా పట్టు సాధిస్తారని చెప్పవచ్చు. ఈ జిల్లాల్లో మెజారిటీ వచ్చిన వారికి రాష్ట్రంలో అధికారం ఖాయమని చెప్పవచ్చు. 2014లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడిపి ఆధిక్యం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019లో వైసీపీ భారీ లీడ్ తెచ్చుకుని సత్తా చాటింది. మరి ఈ సారి ఎన్నికల్లో ఎవరికి వారు ఆధిక్యం తెచ్చుకోవాలని చూస్తున్నారు.

అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు ఉన్నాయి..టిడిపి, వైసీపీ,జనసేన ఇలా మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే..టిడిపి, వైసీపీల మధ్య టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది..కొన్ని సీట్లలో త్రిముఖ పోరు జరగవచ్చు. కానీ టిడిపి-జనసేన కలిస్తే వార్ వన్ సైడ్ అయినట్లే. ఇప్పటికే చంద్రబాబు, పవన్ పొత్తు దిశగానే పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. పైగా ఇద్దరు నేతలు ఇప్పుడు గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులని పరామర్శించే పనిలో ఉన్నారు. ఇలా ఇద్దరు గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు.
ఇక టిడిపి-జనసేనలు పొత్తులో వెళితే..గోదావరి జిల్లాల్లో వైసీపీ భారీగా నష్టపోనుంది. గత ఎన్నికల్లో టిడిపి-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ లాభపడింది..కానీ ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ నష్టపోనుంది. పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉన్న విషయం తెలిసిందే. టిడిపి-జనసేన కలిస్తే డౌట్ లేకుండా 12 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది.
అటు తూర్పు గోదావరిలో 19 సీట్లు ఉన్నాయి..వాటిల్లో 14 సీట్లు డౌట్ లేకుండా గెలవచ్చు..ఇంకా రెండు, మూడు సీట్లలో టఫ్ ఫైట్ ఉండవచ్చు. ఏదేమైనా గాని బాబు, పవన్ కాంబినేషన్ తో గోదావరి జిల్లాల్లో 25 పైనే సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది.
