ఏపీలో పొత్తు రాజకీయాలపై అనేక ట్విస్ట్‌లు వస్తున్నాయి…టీడీపీ-జనసేనలు నెక్స్ట్ పొత్తు పెట్టుకుంటాయనే..ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం సైతం నిజమయ్యేలాగానే కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ-జనసేనలు కలిస్తేనే ప్లస్ అవుతుంది…ఆ రెండు విడిగా పోటీ చేస్తే మైనస్ అయ్యి..వైసీపీకి ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో అదే జరిగింది.

ఇక ఆ తప్పుని మళ్ళీ చేయకూడదని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే వారు అంతర్గతం పొత్తు అంశంపై చర్చలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కింది స్థాయి నాయకులు పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్నిచోట్ల మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే బెటర్ అని…అటు టీడీపీ, ఇటు జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

అయితే ఈ పొత్తు వరకు ఓకే గానీ…బీజేపీని కలుపుకునే విషయంలో టీడీపీ శ్రేణులు కాస్త అసంతృప్తిగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడు పవన్ ఎలాగో బీజేపీతో కలిసి ఉన్నారు. ఆయన రెండు పార్టీలని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి…ఏదైనా అడ్వాంటేజ్ ఉండొచ్చని చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రాష్ట్రానికి ఎలాంటి సాయం చేయని బీజేపీపై టీడీపీ శ్రేణులు గత ఎన్నికల నుంచి కోపంగానే ఉన్నారు.

పైగా కొందరు బీజేపీ నేతలు..చంద్రబాబుని ఏ విధంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారో కూడా చూశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీతో పొత్తు వద్దు అనేది టీడీపీ శ్రేణుల డిమాండ్. అయినా ఏపీలో బీజేపీకి పెద్ద బలం లేదు. ఆ పార్టీ స్వతహాగా ఒక సీటు కూడా గెలుచుకోలేదు. అలాంటప్పుడు పొత్తు పెట్టుకుని బీజేపీకి కాస్త అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, ఆల్రెడీ 2014లో అలాగే జరిగితే బీజేపీ నేతలు ఎలా రెచ్చిపోయారో తెలుసని, అందుకే బీజేపీతో కాకుండా పవన్‌తో ముందుకెళితే తమకు ఓకే అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

Discussion about this post