వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు, పవన్ భేటీతో పొత్తు దాదాపు ఖాయమైనట్లే అని అర్ధమవుతుంది. కాకపోతే వారు వైసీపీ ప్రభుత్వం అరాచక విధానాలపై కలిసి పోరాడటానికి కలిశామని చెబుతున్నారు గాని..పరోక్షంగా పొత్తుకు రెడీ అవుతున్నారని అర్ధమవుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే వైసీపీకి నష్టం జరగడం ఖాయమని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది.

కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు, పవన్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు పొత్తుపై ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ-జనసేన పొత్తు లేకుండా చేయాలని ఎలాగోలా వైసీపీ నేతలు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌ని దమ్ముతుంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని రెచ్చగొట్టడం, జనసేన శ్రేణులని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారని, ప్యాకేజ్‌కు అమ్ముడుపోయారని పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా చంద్రబాబుని పవన్ కలవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

బాబుకు పవన్ బానిసత్వం చేస్తున్నారని, కొత్త ప్యాకేజ్ వచ్చిందని, ఇక వారు కలిసి పోటీ చేసిన జగన్ సింగిల్‌గా వస్తారని, సత్తా చాటుతారని అంటున్నారు. అంటే పొత్తు జగన్‌ని ఏం చేయలేదని చెబుతూనే..పొత్తుని ఎలాగోలా దెబ్బకొట్టాలని వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. పైగా జగన్ ఒంటరిగా పోరాడుతున్నారని సెంటిమెంట్ లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ రకరకాల ఎత్తులతో ముందుకొస్తుంది.

కానీ ఎంత సెంటిమెంట్ లేపిన, టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినా..ఈ సారి వర్కౌట్ అయ్యేలా లేదు. వైసీపీ కుట్రలని సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు. పైగా జగన్ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్ధమైంది..ఆ పాలన తెలియకుండా ఏదో హడావిడి చేసినా సరే వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అయ్యేలా లేదు.
