రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలనే విషయం బాగా అవగాహన ఉన్నవారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ముందు ఉంటారని చెప్పొచ్చు..ఈయన సమయానికి తగ్గట్టు రాజకీయం చేసి సక్సెస్ అవుతుంటారు…అలా చేస్తూ వచ్చారు కాబట్టే…ఇంతవరకు గంటా ఫెయిల్ అవ్వలేదు…1999 నుంచి విజయాలు సాధిస్తూనే వచ్చారు..పార్టీలు మారినా, నియోజకవర్గాలు మారినా కూడా ఈయన విజయం ఎక్కడ ఆగలేదు.

ఇలా తనదైన శైలిలో రాజకీయం చేస్తున్న గంటా ఇప్పుడు సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి అసలు యాక్టివ్‌గా ఉండటం లేదనే సంగతి తెలిసిందే. టీడీపీ ప్రతిపక్షంలో ఉండటంతో సైలెంట్‌గా ఉంటున్నారు…అదే సమయంలో ఈయన వైసీపీ వైపు వెళ్లడానికి చూశారని ప్రచారం వచ్చింది. కానీ గంటా పార్టీ మారలేదు…అయితే ఇటీవల ఈయన టీడీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు…కాకపోతే పార్టీ కార్యక్రమాలతో సంబంధం లేకుండా, సెపరేట్‌గా రాజకీయం నడుపుతున్నారు.

అలాగే ఇటీవల రాష్ట్రంలోని కాపు నేతలంతా సెపరేట్‌గా సమావేశం పెట్టుకున్న విషయం తెలిసిందే…ఆ సమావేశంలో గంటా కీలకపాత్ర పోషించారని తెలిసింది. రాష్ట్రంలో కాపులకు అధికారం దక్కేలా చేయాలని గంటా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ దిశగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్తితుల్లో సెపరేట్‌గా పార్టీ పెట్టడం కుదరదు..అలాగే జనసేనని అధికారంలోకి తీసుకురావడం కష్టం.

అందుకే టీడీపీతో జనసేనని కలిపితే….రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వస్తే అప్పుడు కాపులు కీలకపాత్ర పోషించినట్లు అవుతుందనేది గంటా ఐడియా అని తెలుస్తోంది. అలాగే కాపులు అధికారం షేర్ చేసుకోవచ్చు..ఆ దిశగానే ఇప్పుడు గంటా రాజకీయం నడుపుతున్నట్లు తెలుస్తోంది…అంటే చంద్రబాబు-పవన్ కల్యాణ్‌ని కలపడానికి గంటా చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన…బాబుతో ప్రత్యేకంగా సమావేశం అవ్వడానికి చూస్తున్నారని తెలిసింది. అటు పవన్‌ని సైతం కలిసి…మొత్తం సెట్ చేయాలని చూస్తున్నారట. ఇక టీడీపీ-జనసేనలు గాని కలిస్తే రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడం సులువు అవుతుంది. మరి చూడాలి గంటా ప్లాన్ ఏ మేర వర్కౌట్ అవుతుందో.


Discussion about this post