అధికార వైసీపీలో ఉన్న మంత్రులు, కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎందుకు ప్రెస్ మీట్లు పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలని చెప్పడం కంటే..ప్రతిపక్షాలని తిట్టడానికే ఎక్కువ ప్రెస్ మీట్లు పెడతారనే వాదన ఎక్కువగా వస్తుంది. అందులో నిజం ఉందనే విషయం ప్రజలకు తెలుసు. ప్రతిపక్షాలు ఏదైనా అంశంపై విమర్శలు చేస్తే వాటికి వివరణ ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకులని తిట్టడమే టార్గెట్ గా పెట్టుకుంటారు.

అయితే ఇలా ప్రతిపక్ష నాయకులని తిడుతూ..తమ పదవులని కాపాడుకోవడం గాని, లేదా జగన్ ఏమైనా పదవులు ఇస్తారనే విధంగా వైసీపీ నేతల రాజకీయం ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. అందుకే తిట్టేవారికే మంత్రి పదవులు ఇచ్చారనే వాదన ఉంది. ఇదే సమయంలో వైసీపీ యువ నేతగా మంచి క్రేజ్ తెచ్చుకున్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం అదే వరుసలో వెళ్ళుతున్నారని అంటున్నారు. ఈ మధ్య పార్టీలో యూత్ అధ్యక్షుడుగా పదవి వచ్చింది. దీంతో బైరెడ్డి దూకుడు మరింత పెరిగింది. అంతకముందు వరకు బైరెడ్డి…చంద్రబాబు, పవన్‌లపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.

వరుసపెట్టి బాబు-పవన్ లపై ఫైర్ అవుతున్నారు. అలాగే జగన్‌కు భజన చేసే విషయంలో కూడా ఏ మాత్రం తగ్గడం లేదని, బైరెడ్డి కూడా రాజకీయం నేర్చుకున్నారని, సీనియర్లని ఫాలో అవుతూ..పదవులు ఎలా ఎలా సంపాదించాలో తెలుసుకున్నారని టీడీపీ-జనసేన శ్రేణులు కామెంట్ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు దక్కించుకోవడం కోసమే బైరెడ్డి ఇలా తిప్పలు పడుతున్నారని, బాబు-పవన్‌ని తిడితే సీటు ఫిక్స్ అని భావిస్తున్నారని, అందుకే అదే లైన్ లో బైరెడ్డి వస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. చూడాలి మరి బైరెడ్డికి సీటు దక్కుతుందో లేదో.

Leave feedback about this