ఇటీవల ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాయని ప్రచారం నడుస్తోంది. అయితే పొత్తు పెట్టుకోవడానికి బాబు రెడీగా ఉన్న , పవన్ ఇప్పుడే రెడీగా లేరని కథనాలు కూడా వస్తున్నాయి. కానీ జగన్‌కు చెక్ పెట్టాలంటే టీడీపీతో కలవాల్సిందే అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు పొత్తు గురించి మాట్లాడవద్దని అంటున్నా సరే…ఎన్నికల ముందు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పవన్ సైతం పొత్తు గురించి ఇప్పుడు మాట్లాడవద్దని అంటున్నారు గానీ…పొత్తు అసలు వద్దు అనడం లేదు.

దీని బట్టి చూస్తే రెండు పార్టీల పొత్తు ఖాయమయ్యేలా ఉన్నాయి. ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పాలి. ఈ పరిస్తితి పూర్తిగా వైసీపీకి తెలుస్తోంది. అలాగే కాపుల ఓట్లు వన్‌సైడ్‌గా వైసీపీకి దూరమైపోతాయి. ఆ విషయం జగన్‌కు సైతం అర్ధమవుతున్నట్లు ఉంది. అందుకే జగన్ ఒక్కసారిగా స్ట్రాటజీ మర్చినట్లు కనిపిస్తోంది. ఇంతకాలం తనకు కొద్దో గొప్పో పాజిటివ్‌గా మాట్లాడుతున్న చిరంజీవి ద్వారా రాజకీయాన్ని మార్చడానికి వ్యూహాలు సిద్ధం చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల సినిమా టిక్కెట్ల అంశంపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై సినీ ఇండస్ట్రీ…జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది..ఈ తరుణంలోనే జగన్, చిరంజీవిని ఒక్కరినే చర్చలకు ఆహ్వానించారు. ఇండస్ట్రీలో అనేక మంది పెద్ద నటులు ఉన్నా సరే జగన్…కేవలం చిరుని పిలిచారు. ఇక చిరు కూడా భేటీ తర్వాత బయటకొచ్చి జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.

ఇలా చిరు మాట్లాడటం ఇండస్ట్రీ వారికి పెద్దగా నచ్చలేదు..సమస్యకు పరిష్కారం లేకుండా పొగడ్తల వల్ల ప్రయోజనం లేదంటున్నారు. అటు జనసేన శ్రేణులు సైతం చిరు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. అంటే చిరు ద్వారా కాపులని..బాబు-పవన్‌ల వైపు వెళ్లకుండా జగన్ ప్లాన్ చేశారని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి బాబు-పవన్‌లకు జగన్-చిరు చెక్ పెడతారో లేదో.

Discussion about this post