టీడీపీ అధినేత చంద్రబాబు మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గం కు ప్పం విషయంలో ఆయన ఎంచుకున్న వ్యూహానికి మంచి మార్కులు పడుతున్నాయి. తాజాగా చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటిం చారు. త్వరలోనే తాను ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని.. ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటానని కూడా చెప్పారు. అంతేకాదు. ఏడాదిలో రెండు మూడు నెలలపాటు ఇక్కడ ఉండి పరిస్థితులను చక్కదిద్దే ప్రయ త్నం చేస్తానన్నారు.

ముఖ్యంగా నియోజకవర్గంపై దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు.. నియోజకవ ర్గంలో ప్రతి కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కాన్సెప్ట్ మంచిగా వర్కవుట్ అవుతోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే… ఇప్పటి వరకు చంద్రబాబు ఇక్కడ అందుబా టులో లేక పోవడం వల్ల.. నియోజకవర్గంలో పరిస్థితులను అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చు కుందని అంటున్నారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబు ఇక్కడ దృష్టి పెట్టడంవల్ల.. అధికార పార్టీ దూకు డుకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అంతేకాదు.. తమ్ముళ్ల మధ్య ఉన్న అసంతృప్తులు.. ఆధిపత్య పోరుకుకూడా కుప్పంలో చెక్ పెట్టేందుకు చంద్రబాబు వ్యూహం ఉపయోగపడుతుందని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికలను అన్నిపార్టీలు ప్రధానంగా తీసుకోవడం.. ప్రతిష్టాత్మకంగా ఇక్కడ వైసీపీ నేతలు పావులు కదుపుతుండడంతో ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ నేతలను రీజార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి నాయకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం గమనార్హం.

ఇప్పటికే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుని వుంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు . అంతేకాదు.. కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా..చంద్రబాబు ఇక్కడకు రావాలని చాలా మంది నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా పార్టీలో కొందరు నాయకులు అనుసరిస్తున్న ధోరణిని కూడా వారు తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం బాగుంటుందని.. వర్కవుట్ అవుతుందని.. పార్టీకి బూస్ట్ లా పనిచేస్తుందని అంటున్నారు.

Discussion about this post