ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు పైనే సమయం ఉండగానే చంద్రబాబు…ఎక్కడకక్కడ అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే…నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా బాబు ఇప్పటినుంచే అభ్యర్ధులని ఖరారు చేసేస్తున్నారు..ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అయితే ఇంకా కొన్ని చోట్ల అభ్యర్ధులని ఫిక్స్ చేయాల్సిన అవసరముంది…కొన్ని చోట్ల సీట్ల కోసం నేతల మధ్య పోటీ ఎక్కువ ఉంది అందుకే బాబు కొన్ని సీట్లని ఫిక్స్ చేసే విషయంలో ఆలస్యం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో కూడా కొన్ని సీట్లని ఖరారు చేయాల్సిన అవసరముంది…టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతలో..దాదాపు చాలా సీట్లు ఫిక్స్ అయ్యాయని చెప్పొచ్చు..ఎలాగో సిట్టింగ్ సీట్లుగా ఉన్న హిందూపురం, ఉరవకొండల్లో బాలయ్య, పయ్యావుల కేశవ్ పోటీ చేయడం ఖాయం. హిందూపురంలో బాలయ్య, ఉరవకొండలో కేశవ్ పోటీ చేస్తారు. ఇక కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ పోటీ చేస్తారు.

అలాగే రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు, కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయుడు, గుంతకల్లులో జితేంద్ర గౌడ్ బరిలో దిగుతారు. ఇక రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌లు పోటీ చేయడం ఖాయమే. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గాని ఆయన కుమారుడు అస్మిత్ గాని పోటీ చేస్తారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి, అనంత అర్బన్‌లో ప్రభాకర్ చౌదరీ పోటీ చేస్తారు. ఇక శింగనమలలో ఇంచార్జ్‌గా బండారు శ్రావణి ఉన్నారు…మరి ఆమెకు సీటు ఫిక్స్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ రాలేదు.

అటు మడకశిర సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి పోటీ పడుతున్నారు. ఇక వీరిలో మడకశిర సీటు ఎవరికి దక్కుతుందో ఇంకా క్లారిటీ రాలేదు..అటు పెనుకొండ ఇంచార్జ్‌గా బీకే పార్థసారథి ఉన్నారు..అయితే ఈయన్ని హిందూపురం ఎంపీగా నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది..అదే జరిగితే పెనుకొండలో వేరే అభ్యర్ధిని పెట్టాలి…చూడాలి మరి అనంతలో మిగిలిన సీట్లపై బాబు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.

Discussion about this post