టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న జిల్లాల పర్యటనలకు అనూహ్య స్పందన వస్తోంది. ఆయనే చెప్పి నట్టుగా.. వైసీపీ అధినేత, సీఎం జగన్ సభలకు ప్రజలను కూర్చోబెట్టేందుకు పోలీసులు ఇబ్బంది పడు తుంటే.. అదే పోలీసులు చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజలను కట్టడి చేయలేక.. ఇబ్బంది పడుతు న్నారనేది వాస్తవం. ఎక్కడ పర్యటించినా.. చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతాలు పలుకుతున్నారు. అదేసమయంలో ఆయన ప్రసంగాలను కూడా ఆసక్తిగా వింటున్నారు.

ఈ మార్పును గమనిస్తున్న టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. నిజానికి గత మూడేళ్లలో పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. అయితే.. ఎక్కడికక్కడ నాయకు లు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు వచ్చాయి. కానీ, ఇప్పుడు స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగడంతో పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. పైగా.. జనాలు కూడా క్యూకడుతున్నారు. మార్పునకు ఇది మంచి అవకాశం అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

తాజాగా రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వరుస పర్యటనలు చేశారు. ఈ మూడు జిల్లాల్లోనూ.. చంద్రబాబుకు అనూహ్యమైన స్పందన లభించింది. పార్టీ నేతల నుంచి ప్రజల వరకు అందరూ కూడా చంద్రబాబుకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. గజమాలలతో ఆయనను స్వాగతించారు. అదే సమయంలో నాయకులు కూడా వైరుద్ధ్యాలను పక్కన పెట్టి మరీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇక, పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా.. చంద్రబాబు వస్తున్నారని తెలిసి.. ప్రజలు కూడా క్యూ కట్టారు. దీనికి కారణం.. మళ్లీ మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే బలమైన ఆకాంక్ష ప్రజలలో ఉండబట్టేనని.. టీడీపీనాయకులు విశ్లేషిస్తున్నారు. ఇదే ఊపు వచ్చే రెండు సంవత్సరాలు కూడా కొనిసాగిస్తే.. పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post