రాష్ట్రంలో వైసీపీకి అనుకూల పవనాలు పెద్దగా లేవు..వ్యతిరేక పరిస్తితులే ఎక్కువ కనిపిస్తున్నాయి. పైగా ఆదాయం లేకపోవడం వల్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాల్సిన పరిస్తితి. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని దుస్తితి. ఇంకా ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం కేంద్రం అండ వల్ల కొంతమేర బండి లాగుతున్నారు. ఉన్నకొద్ది అవి కూడా రావు. ఇలాంటి పరిస్తితుల్లో జగన్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. ముందస్తుకు వెళ్లడానికే జగన్ రెడీ అయ్యారని తెలుస్తుంది.
ఈ విషయంపై చంద్రబాబు ఎప్పటినుంచో మాట్లాడుతున్నారు..జగన్ ఖచ్చితంగా ముందస్తుకే వెళ్తారని అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు..మినీ మేనిఫెస్టో కూడా ప్రకటించారు. దీంతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. మేనిఫెస్టోపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

జగన్ సైతం టిడిపి మేనిఫెస్టో పై స్పందించారంటే పరిస్తితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తాజాగా బాబు మేనిఫెస్టో కాపీ మేనిఫెస్టో అని కర్నాటక నుంచి కాపీ చేశారని, అలాగే తమ అమ్మఒడి, రైతు భరోసాలని కాపీచేశారని విమర్శించారు. అయితే జగన్ ఇప్పుడు అమలు చేసే పథకాలు దాదాపు కాపీనే..ఒకటి రెండు తప్ప. గతంలో ఇచ్చిన పథకాలు.
గతంలో టిడిపి హయాంలో అన్నదాత సుఖీభవని జగన్ రైతు భరోసాగా మార్చారు. మొదట రూ.12,500 ఇస్తానని మాట మార్చి రూ.7,500 ఇస్తున్నారు. కేంద్రం పిఎం కిసాన్ 6 వేలు ఇస్తుంది. అయితే ఇప్పుడు బాబు 20 వేలు ఇస్తానని అంటున్నారు. ఇది కాపీ కాదు. ఇక అమ్మఒడి కింద జగన్ ఇంట్లో ఒక విద్యార్ధికే రూ.13 వేలు ఇస్తున్నారు. కానీ బాబు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరిట రూ.15 వేలు ఇస్తానని అంటున్నారు. ఇది కాపీ కాదు.
ఇక ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 టూ 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు, ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం..ఇవేమీ జగన్ ఇవ్వట్లేదు..బాబు కొత్తగా అమలు చేస్తానంటున్న పథకాలు. ఇక ఈ పథకాలతో తమకు ఇబ్బంది అని జగన్ కాపీ అని విమర్శలు చేస్తున్నారు.