జగన్ని ఓడించే విధంగా చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారని తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే చెబుతున్నారు. మహానాడు వేదికగా జగన్ ఓటమికి బాబు బాట వేశారని అంటున్నారు. సంక్షేమం పేరుతో రూపాయి ఇస్తూ..పన్నుల రూపంలో వంద రూపాయిలు కొట్టేస్తున్న జగన్కు అసలు సంక్షేమం ఏంటో చంద్రబాబు చూపించనున్నారని, అలాగే వేల కోట్లు కొట్టేస్తున్న వైసీపీ నేతలకు గద్దె దిగే టైమ్ దగ్గరపడిందని అంటున్నారు.
అయితే మహానాడు వేదికగా చంద్రబాబు ఊహించని విధంగా మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు..వ్యతిరేకత పెరుగుతుందని జగన్..ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దీంతో బాబు ముందు జాగ్రత్తతో ఉన్నారు. ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా బాబు..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందుకే తాజాగా మాననదు వేదికగా ఊహించని విధంగా మేనిఫెస్టో ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ మేనిఫెస్టో ప్రజలని ఆకట్టుకునే పథకాలు ఉన్నాయి.

మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టూ రిచ్..అంటూ ఆరు అంశాలతో మేనిఫెస్టో రూపోదించారు. అందులో కీలకమైన హామీలు..18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే..అంతమందికి ఏడాదికి రూ.15 వేలు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత..జిల్లాల్లో ప్రయాణానికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం..సంతానం ఎంతమంది ఉన్న స్థానిక ఎన్నికల్లో మహిళలు పోటీ చేసే వీలు.
నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు..5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు..ఇలా కీలక హామీలని ఇచ్చారు. ఈ హామీలు ప్రజలని ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఇంకా జగన్ పని అయిపోయినట్లే..ఓటమి బాట
