అనూహ్య పరిణామాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తమైన బాబు..పవన్ తో పొత్తు కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీ నుంచి బాబుకు పిలుపు వచ్చిందా? లేదా బాబే వెళ్ళారా? అనేడీ క్లారిటీ లేదు కానీ అనూహ్యంగా ఆయన..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సరే అమిత్ షాతో అంటే ఏదైనా దేశం కోసమని అనుకోవచ్చు. కానీ ఆ భేటీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా కూడా మధ్యలో జాయిన్ అయ్యారు.

దీంతో ఇప్పుడు పొత్తులపై చర్చ వెళ్లింది. ఓ వైపు అమిత్ షా..బాబుని ఎన్డీయేలోకి ఆహ్వానించారని టాక్ నడుస్తుంది. కాదు కాదు బాబు..టిడిపి-జనసేనతో బిజేపి కలిసి రావాలని కోరారని మరో టాక్ వస్తుంది. ఈ రెండిటిల్లో ఏదో నిజమో ఎవరికి తెలియదు. అటు షా గాని, ఇటు బాబు గాని మీడియాతో మాట్లాడలేదు. పైగా బాబు..మోదీతో కూడా భేటీ కానున్నారు. దీంతో ఢిల్లీలో ఏం జరుగుతుందనే చర్చ వస్తుంది. అయితే ఓ వర్గం కథనం ప్రకారం బాబు..బిజేపికి ఆఫర్ ఇచ్చారట..12 ఎమ్మెల్యే, 8 ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారట..అలాగే తెలంగాణలో సహకరిస్తామని అన్నారట.
అయితే ఈ కథనం వాస్తవానికి చాలా దూరంగా ఉంది. అసలు 8 సీట్లు ఇవ్వడం బిజేపికి అనేది సాధ్యం అవ్వని పని..ఏ మాత్రం బలం లేని బిజేపికి అన్నీ సీట్లు కష్టమే. ఇక బాబుని అమిత్ షా ఎన్డీయేలో ఆహ్వానించడం, తెలంగాణలో సహకరించాలని అడగటం, ఏపీలో 8 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారట. కానీ బిజేపి..జగన్కు సపోర్ట్ గా ఉందని, ఏపీలో బిజేపిపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని, అన్నీ సీట్లు ఇచ్చిన టిడిపి ఓట్లు బిజేపికి బదిలీ కావని, బిజేపి ముందు వైసీపీకి దూరం కావాలని బాబు అన్నారని మరో వర్గం అంటుంది. వీటిల్లో ఏ కథనం నిజమో తెలియదు..అసలు బాబు, షా మధ్య ఏం జరిగిందో తెలియదు. ఏదైనా బాబు మాత్రమే మీడియా ముందుకొచ్చి చెబితే తెలుస్తుంది. కానీ బాబు, బిజేపి పెద్దలని కలవడం వైసీపీకి టెన్షన్ పెరిగింది.