మీ బిడ్డ 2 లక్షల కోట్లు పథకాల రూపంలో నేరుగా బ్యాక్ ఖాతాల్లో వేశారు..గత ప్రభుత్వాలు ఇలా చేయలేదు..అప్పుడు అంతా అవినీతి..అందుకే గత చంద్రబాబు పాలన..ఇప్పుడు తన పాలన పోల్చుకుని చూడండి..అప్పుడు మీకు ఏది బాగుందో అర్ధమవుతుంది..అలా పోల్చుకుని పాలన బాగా చేసిన వారికి ఓటు వేయండి అంటూ..జగన్ పదే పదే సెంటిమెంట్ డైలాగులు వదులుతున్న విషయం తెలిసిందే.
అంటే జగన్ ఉద్దేశం..గత బాబు పాలన కంటే..ఇప్పుడు బెటర్ గా పాలన చేస్తున్నానని అనుకుంటున్నారు. అందుకే తనకు మద్ధతు ఇవ్వాలని జనాలని కోరుతున్నారు. అయితే జగన్ చెబుతున్నట్లుగా ప్రజలు..గత పాలన, ఇప్పుడు పాలన పోల్చుకుంటే వైసీపీ వాళ్ళు తప్ప..మిగతా జనమంతా చంద్రబాబు పాలన బెటర్ గా ఉందని అనుకుంటారు. ఎందుకంటే జగన్ ఏదో పథకాలు అమలు చేసేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆ పథకాలు బాబు హయాంలో అమలు అయ్యాయి.

అప్పుడు పెన్షన్లు, ఆరోగ్య శ్రీ, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, పసుపు, కుంకుమ కింద డబ్బులు ఇవ్వడం, బీమా పథకం, రైతులకు కొంతమేర రుణమాఫీ చేయడం..అన్నిటికంటే కార్పొరేషన్ల ద్వారా పలు కులాలకు అండగా నిలిచారు. అభివృద్ధి చేస్తూ..ఆదాయం పెంచడానికి చూశారు. ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేయడానికి పునాది వేశారు. పోలవరంతో సహ నీటి ప్రాజెక్టుల పూర్తి చేయాలని చూశారు. ముఖ్యంగా ప్రజలపై పన్నుల భారం పెంచలేదు.
కానీ ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తున్నారు..అప్పులు చేస్తున్నారు..ఆదాయం సృష్టించేది లేదు..ప్రజలపై పన్నుల భారం పెంచారు..నీటి ప్రాజెక్టులని పట్టించుకునేది లేదు..కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు లోన్లు ఇవ్వడం లేదు. అదనంగా ప్రశ్నించే వారిపై కేసులు, రాజకీయ కక్ష..రౌడీయిజం పెరగడం, ఇంకా భూ అక్రమాలు, ఇసుక దందాలు..అబ్బో ఒకటి ఏంటి చాలానే ఉన్నాయి. కాబట్టి బాబు పాలన, జగన్ పాలన పోల్చుకుంటే..జగన్ కే నష్టం.