May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఉత్తరాంధ్రపై బాబు స్పెషల్ ఫోకస్..టీడీపీకి లీడ్ పెరిగేలా..!

ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనే చెప్పాలి..గతంలో ఇక్కడ టి‌డి‌పి చాలాసార్లు సత్తా చాటింది. కానీ గత ఎన్నికల్లోనే టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది. ఉత్తరాంధ్రలో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ హవా నడిచింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైసీపీ ఆధిక్యం వచ్చింది.

శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. విజయనగరంలో 9 సీట్లు ఉంటే..వైసీపీ 9 సీట్లు కైవసం చేసుకుంది. ఇక విశాఖలో 15 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకుంది. మొత్తం మీద ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే..వైసీపీ 28, టి‌డి‌పి 6 సీట్లు గెలుచుకుంది. అంటే వైసీపీకి భారీగా సీట్లు తెచ్చుకుంది. అయితే అధికారంలోకి వచ్చాక టి‌డి‌పిని మరింత దెబ్బతీసేలా వైసీపీ వ్యూహాలు వేస్తూ వచ్చింది. బలమైన టి‌డి‌పి నాయకులపై కేసులు పెట్టడం, వారిని రాజకీయంగా దెబ్బతీయడానికి చేయడానికి ప్రయత్నాలు లేవు. ఇక మూడు రాజధానులు అని చెప్పి..విశాఖని పరిపాలన రాజధాని అని రాజకీయంగా లబ్ది పొందడానికి స్కెచ్ వేశారు.

కానీ ఇంతవరకు రాజధానికి అతీగతీ లేదు. దీంతో ఉత్తరాంధ్రలో వైసీపీకే రిస్క్ అవుతూ వచ్చింది. నిదానంగా టి‌డి‌పి బలపడుతూ వచ్చింది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో టి‌డి‌పి ఆధిక్యం దిశగా వెళుతుంది. ఈ క్రమంలోనే బాబు..ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. పెందుర్తి, శృంగవరపుకోట, పాతపట్నం, పార్వతీపురం నియోజకవర్గాల్లో బాబు పర్యటనలు ఈ నెలలో ఉన్నాయి. దీంతో టి‌డి‌పికి మరింత బలం పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో టి‌డి‌పికి 15-20 సీట్లలో ఆధిక్యం ఉంది..ఇక టి‌డి‌పితో జనసేన గాని పొత్తు పెట్టుకుంటే 25 సీట్లలో గెలవడం ఖాయమని చెప్పవచ్చు.