జగన్ అధికారంలోకి వచ్చాక అన్నీ రంగాలు వెనుబడ్డాయి..అభివృద్ధి జరగడం లేదు. ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకెళ్లడం లేదు. కేవలం అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం..మళ్ళీ వాటిని పన్నుల రూపంలో వెనక్కి లాక్కోవడం ఇవే చేసేది. ఇక ఏపీ వ్యవసాయానికి ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశారు. ఇక ప్రతి అంశంపై పోరాడుతూ వస్తున్న చంద్రబాబు..ఆగష్టు 1 నుంచి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ రాయలసీమ నుంచి, ఉత్తరాంధ్ర వరకు ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులని పరిశీలిస్తూ..వాటి పని ఎంతవరకు వచ్చింది.
గతంలో టిడిపి ఎంత ఖర్చు చేసింది..ఇప్పుడు వైసీపీ ఎంత ఖర్చు చేసిందని, ప్రాజెక్టుల వద్దే బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అలాగే భారీ బహిరంగ సభలు నిర్వహించారు. అయితే పైకి జరిగింది. కానీ దీని వెనుక సీక్రెట్ స్కెచ్ ఒకటి ఉంది. టిడిపిని బలోపేతం చేసే విధంగా ఆయన ముందుకెళ్లారు. ఇక ఆయన టూర్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. శ్రీకాకుళంలో బహిరంగ సభతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ టూర్ సూపర్ సక్సెస్ అయింది. మధ్యలో వైసీపీ రాజకీయంగా ఇబ్బందులు పెట్టడం, దాడులు చేయడం, కేసులు పెట్టడం చేసింది..అయిన బాబు వెనక్కి తగ్గలేదు. దాడులు చేసిందే కాకుండా తిరిగి రివర్స్ లో కేసులు పెట్టారు. ఈ అంశమే టిడిపికి పెద్ద ప్లస్. ఇక బాబు టూర్ వెనుక ఉన్న మరో అంశం ఏంటంటే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రజా స్పందన..ఆయనకూ అన్నీ చోట్ల భారీ స్పందన వచ్చింది.
ఇక సరిగ్గా గమనిస్తే ఆయన..సభలు పెట్టిన నియోజకవర్గాలు..ఎక్కువగా కొత్త ఇంచార్జ్లని పెట్టిన నియోజకవర్గాలే. పూతలపట్టు, నందికొట్కూరు, గోపాలాపురం, రాజానగరం, పార్వతీపురం…ఇలా కొత్త ఇంచార్జ్లు ఉన్నచోట సభలు పెట్టి టిడిపికి మరింత బలం చేకూరేలా బాబు ముందుకెళ్లారు. మొత్తానికి అటు టూర్ సక్సెస్ అయింది..ఇటు టిడిపికి బలం పెరిగింది.