ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు సైలెంట్‌గా ఉన్న పవన్ కల్యాణ్ ఒక్కసారిగా దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు పవన్ కంటే ముందు నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు నేతలు, జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా ముందుకెళుతున్నారు.

ఈ క్రమంలోనే మరొకసారి బాబు-పవన్‌లు జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయని ఏపీ రాజకీయాల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ ఇద్దరు కలిస్తే జగన్‌కు చెక్ పెట్టేయోచ్చని తెలుస్తోంది. అయితే ఒకవేళ వీరు సెపరేట్‌గా ఉంటే జగన్‌కే బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అదే జరిగింది…టిడిపి-జనసేనలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది. టిడిపి గెలవాల్సిన చోట జనసేన ఓట్లు చీల్చి పరోక్షంగా వైసీపీకి బెనిఫిట్ అయ్యేలా చేసింది. అప్పుడే ఆ రెండు పార్టీలు కలిసి ఉంటే వైసీపీకి అంతటి భారీ విజయం కూడా దక్కేది కాదు.

అయితే ఈ సారి ఎన్నికల్లో టిడిపి-జనసేనలు కలిసి పోటీ చేసి వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ రెండు పార్టీలు కలిస్తే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల ఓటమి ఖాయమని తెలుస్తోంది. అందులోనూ పలువురు మంత్రులు ఖచ్చితంగా ఓటమి అంచుకు వెళ్ళడం గ్యారెంటీ అని విశ్లేషకులు అంటున్నారు.

అలా టిడిపి-జనసేనలు గానీ కలిస్తే ఓటమి అంచుకు వెళ్ళే మంత్రుల్లో అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆళ్ల నాని, తానేటి వనిత, శ్రీరంగనాథరాజు, కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల్, పినిపే విశ్వరూప్, అవంతి శ్రీనివాస్‌లు ఖచ్చితంగా ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ మంత్రులకు వారి నియోజకవర్గాల్లో టిడిపి మీద వచ్చిన మెజారిటీ కంటే…జనసేనకు పడిన ఓట్లే ఎక్కువ. అంటే నెక్స్ట్ ఈ మంత్రులు సర్దుకోవచ్చనే చెప్పొచ్చు.

Discussion about this post