May 31, 2023
Uncategorized

బ్యాడ్ రికార్డుని బ్రేక్ చేయనున్న పయ్యావుల..ఆ సీన్ రిపీట్!

ఏపీ రాజకీయాల్లో కొందరు నేతలకు కొన్ని బ్యాడ్ రికార్డులు ఉన్నాయి. ఆ బ్యాడ్ రికార్డులని ఈ సారి ఎన్నికల్లో బ్రేక్ చేయాలని చూస్తున్నారు. అలా తన బ్యాడ్ రికార్డుని బ్రేక్ చేయాలని టి‌డి‌పి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చూస్తున్నారు. ఉరవకొండలో పయ్యావులకు ఒక చెత్త రికార్డు ఉంది. అది ఏంటంటే ఆయన గాని అక్కడ గెలిస్తే..రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి రాదు. ఒకవేళ ఆయన ఓడిపోతే..టి‌డి‌పి అధికారంలోకి వస్తుంది.

1999 ఎన్నికల నుంచి ఇదే సీన్ జరుగుతూ వస్తుంది. 1999 ఎన్నికల్లో ఉరవకొండలో పయ్యావుల ఓడిపోయారు..కానీ రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. ఇక 2004, 2009 ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు..కానీ రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి రాలేదు. రాష్ట్రం విడిపోయాక కూడా  ఆ చెత్త రికార్డు కొనసాగింది. 2014లో పయ్యావుల ఓడిపోతే, రాష్ట్రంలో టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో పయ్యావుల గెలిస్తే..టి‌డి‌పి అధికారంలోకి రాలేదు.

అంటే ఏ విధంగా బ్యాడ్ లక్ కంటిన్యూ అవుతుందో చూడవచ్చు. అయితే ఒక్క 1994 ఎన్నికల్లోనే పయ్యావులకు కలిసొచ్చింది. అప్పుడు తొలిసారి పయ్యావుల గెలవడం, ఇటు టి‌డి‌పి అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ 30 ఏళ్ల తర్వాత అంటే 2024 ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అవుతుందని పయ్యావుల భావిస్తున్నారు.

ఆ దిశగానే రాజకీయం కూడా నడుస్తుందనే చెప్పాలి. ఉరవకొండలో పయ్యావులకు ఆధిక్యత ఉంది..అలాగే రాష్ట్రంలో కూడా టి‌డి‌పి ఆధిక్యంలోకి వస్తుంది. కాబట్టి పయ్యావుల గెలవడం, ఇటు టి‌డి‌పి అధికారంలోకి రావడం జరుగుతుందేమో చూడాలి. ఈ సారి పయ్యావుల చెత్త రికార్డు బ్రేక్ అవుతుందేమో.