Site icon Neti Telugu

బందరు ఎంపీగా వంగవీటి?

రాజకీయంగా కాస్త వైవిధ్యమైన ఎంపీ సీటు ఏదైనా ఉందంటే అది మచిలీపట్నం(బందరు) ఎంపీ సీటు..ఇక్కడ ఫలితం ఎప్పుడు వెరైటీగానే వస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఈ స్థానంలో గెలవడం చాలా తక్కువ. ఏదో రెండు మూడు సందర్భాల్లోనే అది జరిగింది. 1983, 1985ల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బందరులో కాంగ్రెస్ గెలిచింది.  1984, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 1991, 1996 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 1998లో కాంగ్రెస్ గెలవగా, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 2004లో కాంగ్రెస్, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

ఇక ఈ సారి ఇక్కడ ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎంపీ బాలశౌరీ ఉన్నారు. ఆయనకు ఇప్పుడు అక్కడ అంత పాజిటివ్ కనిపించడం లేదు. అదే సమయంలో ఇక్కడ టీడీపీ తరుపున మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఉన్నారు. ఈయనకు కూడా పెద్దగా పాజిటివ్ లేదు. అయితే టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో ఈ సీటులో వైసీపీకి గెలుపు కాస్త కష్టం.

అయితే టీడీపీ-జనసేన పొత్తులో ఈ సీటులో టీడీపీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే టీడీపీ నుంచి కొనకళ్ళ మళ్ళీ పోటీ చేస్తారా? లేక వేరే ఎవరికైనా ఛాన్స్ ఇస్తారా? అనే ప్రచారం వస్తుంది. ఇదే క్రమంలో వంగవీటి రాధా బందరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పొత్తులో భాగంగా రాధా పోటీ చేస్తే గెలుపు ఈజీగా దక్కుతుంది. చూడాలి మరి బందరు బరిలో ఎవరో ఉంటారో. 

Exit mobile version