అదే భజన…అవే విమర్శలు…ప్రజలకు ఏం చేశాం..ఏం చేయాలని అనుకుంటున్నామని చెప్పేది తక్కువ…ప్రతిపక్ష టీడీపీ, మీడియాపై చేసే విమర్శలు ఎక్కువ..పైగా జగన్ కు భజన చేయడం ఎక్కువ…ఇదే తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో కనిపించిన సీన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత ప్లీనరీ సమావేశాలు జరిగాయి…అయితే ఈ సమావేశాలకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చింది తక్కువ…ఏదో నాయకులు..కార్యకర్తలు రాగా, పైగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులని బలవంతంగా సభకు తరలించారని తెలుస్తోంది.

సరే సభకు ఎంతమంది వచ్చారనే విషయం పక్కన పెడితే…సభలో జరిగింది ఏంటి అనేది ఒక్కసారి చూస్తే…వైసీపీ నేతలంతా చేసింది ఒక్కటే…జగన్ కు భజన చేయడం…చంద్రబాబుని తిట్టడం..అలాగే మీడియాపై విరుచుకుపడటం…అదేదో వాళ్ళకు అసలు సొంత మీడియా లేనట్లు..అది చెప్పే అబద్దాలు తెలియనట్లు మాట్లాడుకొచ్చారు. సరే నేతల తీరు ఇలా ఉంటే..సీఎం జగన్ కూడా అదే చేశారు..అదే తరహాలో టీడీపీపై విమర్శలు…సొంత భజన చేసుకున్నారు.

అదేమంటే ప్రతిపక్షాలు అన్నీ కలిసొచ్చిన తనని ఏం చేయలేరని, తనకు ప్రజా మద్ధతు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే దేశంలోనే తనకు లాగా ఎవరు చేయట్లేదనే చెప్పుకున్నారు. అధికారమంటే అహంకారం కాదు.. అధికారమంటే ప్రజలమీద మమకారమని నిరూపిస్తూ ఈ మూడేళ్ల పాటు ప్రజల కోసమే బతికామని, అన్నీ ప్రాంతాల కోసం, అన్ని వర్గాల కోసమే బతికామని, చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతిక్షణం తపిస్తూ బతికామని నాలుగు డైలాగులు వేశారు.

అయితే ఈ డైలాగుల్లో ఎంత అబద్దం ఉందో చెప్పాల్సిన పని లేదని విశ్లేషకులు అంటున్నారు. అసలు అధికారం అంటే అహకారం అన్నట్లే వైసీపీ పాలన సాగిందనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అన్నీ వర్గాల ప్రజలపై పన్నుల భారం పెంచి..వారి నడ్డివిరిచారు..పథకాల పేరిట రూపాయి ఇచ్చి..పన్నుల పేరిట పది రూపాయిలు లాగేశారనే సంగతి ప్రజలకు బాగా తెలుసు. ఏదేమైనా టీడీపీ పుంజుకుంటుందనే అభద్రతాభావం వైసీపీలో బాగా కనిపించిందని చెప్పొచ్చు…అందుకే వైసీపీ నేతలంతా అదే పనిగా చంద్రబాబునే టార్గెట్ చేశారు…మొత్తానికైతే మూడేళ్లలో జగన్ పవర్ తగ్గినట్లే కనిపిస్తోంది.

Discussion about this post