ఆయన బలమైన నాయకుడు అనే పేరు ఉంది. ఆయన నిలబడితే.. ఆయన వెనుక వంద మంది వరకు నిలబడతారనే పేరు కూడా ఉంది. అయితే.. అది నిన్న మొన్నటి వరకు కానీ.. ఇప్పుడు ఆయన ఒంటర య్యారు. ఆయన నిలబడితే.. పట్టించుకునే నాయకుడు కూడా లేకుండా పోయారట. ఈ విషయం.. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నవర్గమే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఆయనే చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి.

కానీ, ఇప్పుడు ఆయనను సోషల్ మీడియాలో బలం తగ్గిన రామ కృష్ణమూర్తి.. అని ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం.. అటు పుట్టినిల్లయిన.. టీడీపీ, ఇటు మెట్టినిల్లయిన.. వైసీపీ కూడా.. ఆయనను పట్టించుకోవడం లే దు. అంటే.. గత ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచి.. వైసీపీ పంచన చేరాక.. తాజాగా టీడీపీ కరణాన్ని వదిలిం చుకుంది. అంతేకాదు.. ఇక్కడ ఇంచార్జ్‌ను కూడా నియమించుకుంది.దీంతో వచ్చే ఎన్నికల్లో కరణం చేరికకు సైకిల్ పార్టీ.. ఫుల్ స్టాప్ పెట్టేసింది.

ఎప్పుడైతే.. ఈ నిర్ణయం వెలువడిందో.. అప్పటి వరకు అంతో ఇంతో టచ్‌లో ఉన్న టీడీపీ నాయకులు కర ణంకు బై చెప్పారు. ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం మాట్లాడనూ మాట్లాడడం లేదు. దీం తో టీడీపీ తలుపులు మూసివేయబడినవనే వ్యాంగ్యాస్త్రాలు పడుతున్నాయట. ఇక, వైసీపీ విషయాన్ని తీసుకుంటే.. ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే ఆమంచికే పార్టీ మొగ్గు చూపుతోంది. ఎందుకంటే.. పార్టీలో చేరినా.. కరణం ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని.. భావిస్తోంది.

పైకి బాలినేని వర్గంగా ఉన్నా.. అంతర్గతంగా.. జెండా అజెండా వేరనే భావన ఇప్పటికీ.. ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోనూ.. ఆయనకు మద్దతుగా మాట్లాడే వారు లేకుండా పోయారు. ఫలితంగా.. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పరిస్థితి ఏమవుతుందనేది.. ఆయన వర్గంలోనే చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే కరణం అంటే.. బలం తగ్గిన రాముడు అని ట్రోల్ చేస్తున్నారు. అంటే.. దీని అర్ధం.. ఆయనకు బలం లేకపోవడం కాదు.. ప్రస్తుతం బలం తగ్గిందని వివరణ కూడా ఇస్తున్నారు. ఇదీ.. సంగతి.

Discussion about this post