గత ఎన్నికల్లో ఓట్ల చీలిక ఓటమి పాలైన వారిలో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఒకరు. విశాఖ ఎంపీగా పోటీ చేసి భరత్ కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అక్కడ జనసేనకు దాదాపు రెండున్నర లక్షల ఓట్ల వరకు వచ్చాయి. ఇక వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ గెలిచారు. ఎంపీగా గెలిచి సత్యనారాయణ విశాఖకు చేసేదేమీ లేదు. పార్లమెంట్ లో పోరాటం చేసేదేమీ లేదు. దీంతో ఆయనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది.

ఇక ఇటు ఎలాగో వైసీపీపై వ్యతిరేకత ఉంది. విశాఖకు రాజధాని తెస్తానని చెబుతున్నా సరే ప్రజలు వైసీపీని నమ్మడం లేదు. ఎందుకంటే రాజధాని పేరుతో విశాఖలో వైసీపీ ఏం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సారి వైసీపీని ఓడించాలని అక్కడే ప్రజలు అనుకుంటున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన భరత్..ప్రజల్లోనే తిరుగుతున్నారు. మూర్తి మనవడుగా భరత్‌కు మంచే పేరుంది. అటు గీతం విద్యాసంస్థలని నడిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి భరత్ వైపు మొగ్గు కనిపిస్తుంది.

అయితే పొత్తుల విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. టిడిపి-జనసేన పొత్తు ఉంటే విశాఖ ఎంపీ సీటుని జనసేన అడుగుతుందని అంటున్నారు. అదే సమయంలో జేడి లక్ష్మీనారాయణ..టిడిపిలోకి గాని, జనసేనలోకి గాని వస్తే ఆయన విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని అంటున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఏ పార్టీ లేకపోయినా ఈ సారి ఇండిపెడెంట్ గా పోటీ చేస్తానని చెబుతున్నారు. దీంతో విశాఖ ఎంపీ సీటుపై క్లారిటీ లేదు.
ఇక పొత్తు ఉన్నా లేకపోయినా ఎవరు బరిలో ఉన్నా..ఈ సారి విశాఖ ఎంపీ సీటు తనదే అని భరత్ అంటున్నారు. అక్కడ నుంచే పోటీ చేస్తానని, గెలుస్తానని అంటున్నారు. బాలయ్య చిన్నల్లుడు కాబట్టి..ఖచ్చితంగా విశాఖ ఎంపీ సీటు భరత్ కే దక్కే ఛాన్స్ ఉంది. అలాగే ఆయన గెలుపు కూడా డౌట్ లేదని చెప్పవచ్చు.
