హిందూపురం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…ఇంతవరకు హిందూపురంలో మరో పార్టీ జెండా ఎగరలేదు…1983 నుంచి ఇప్పటివరకు అక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే వస్తుంది…ఇక గత రెండు ఎన్నికల్లో బాలకృష్ణ అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు…అయితే అక్కడ బాలయ్యని దెబ్బతీయాలని చూస్తున్నారు గాని…అది కుదరడం లేదు. హిందూపురం పూర్తిగా బాలయ్య అడ్డాగా మారిపోయింది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదొకవిధంగా హిందూపురంలో బాలయ్యని వీక్ చేయడానికే చూస్తూ వస్తున్నారు…అలాగే వైసీపీ బలం పెంచుకోవాలని చూస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికారాన్ని ఉపయోగించుకుని విజయాలు కూడా అందుకున్నారు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన సరే…ప్రధాన ఎన్నికల్లో మాత్రం బాలయ్య విజయాన్ని అడ్డుకోవడం చాలా కష్టమనే చెప్పొచ్చు…ఎంత ట్రై చేసుకున్నా హిందూపురంలో బాలయ్యని ఓడించడం అనేది చాలా కష్టమైన పని.

పైగా ఇప్పుడు హిందూపురం వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువైంది..ఎవరికి వారే పెత్తనం చేయాలని చూస్తున్నారు..ముఖ్యంగా ఎమ్మెల్సీ ఇక్బాల్…ఒంటెద్దు పోకడ…సొంత పార్టీ నేతలకే నచ్చడం లేదు. మొత్తం ఆయన పెత్తనమే నడుస్తోంది. అయితే ఇక్బాల్ ఒంటెద్దు పోకడ గురించి…హిందూపురం వైసీపీలో కీలక నేతగా ఉన్న సుబ్రహ్మణ్య రెడ్డి..జగన్ కు ఫిర్యాదు చేశారు. ఇక్బాల్ ఎవరిని కలుపుకుని వెళ్ళడం లేదని చెప్పారు. కష్టపడిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని జగన్ ముందు వాపోయారు.

ఇక అదే సమయంలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని…స్థానికేతురుడిని అని నెగిటివ్ చేస్తున్నారని ఇక్బాల్, జగన్ కు చెప్పారు.ఇక ఈ పంచాయిటీని పరిష్కరించాలని మంత్రి పెద్దిరెడ్డిని…జగన్ ఆదేశించారు. అయితే ఈ ఆధిపత్య పోరు పరిష్కారం అవ్వడం కష్టమే అని చెప్పొచ్చు…ఇప్పటికే హిందూపురంలో వైసీపీ రెండుగా చీలిపోయింది…కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇక్బాల్ పోటీ చేస్తే…మరొక వర్గం సహకరించే పరిస్తితి కనిపించడం లేదు. మొత్తానికి చూసుకుంటే హిందూపురంలో బాలయ్యని ఓడించడం వైసీపీకి కుదిరే పని కాదని చెప్పొచ్చు.

Discussion about this post