ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పెద్ద హాట్ టాపిక్ అయిపోయారు. సినీ ఇండస్ట్రీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుందని చెప్పి పవన్, జగన్ ప్రభుత్వంపై ఫుల్ గా ఫైర్ అయ్యారు. తనపై కోపంతో చిత్ర పరిశ్రమని ఇబ్బంది పెట్టవద్దని కూడా చెప్పారు. ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మే విషయంలో కూడా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇదే క్రమంలో సినీ పెద్దలు కూడా జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు.

ఇదే క్రమంలో పవన్..అనవసరంగా బాలయ్యని లాగారనే వాదన సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినీ పెద్దలు, జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలనే క్రమంలో మోహన్‌బాబుపై ఫైర్ అయ్యారు. జగన్ బంధువులే కాబట్టి మోహన్ బాబు సమస్యలని పరిష్కరించాలని కోరారు. ఇదే సమయంలో కొందరు లేస్తే మనుషులం కాదు…మా వంశాలు వేరు, చరిత్ర అంటూ మాట్లాడేవాళ్లు కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలనే విధంగా మాట్లాడారు.

అయితే పవన్ ఈ వ్యాఖ్యలు బాలయ్య గురించి మాట్లాడారని తెలుస్తోంది. దీనిపై బాలయ్య అభిమానులు పవన్‌పై ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. మొదట నుంచి పరిశ్రమ బాగోగులు కోసం కష్టపడే వ్యక్తి బాలయ్య అని, ఆయన ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమ కోసం పనిచేస్తారని, కానీ కొందరు రాజకీయం చేస్తారని, బాలయ్య మాత్రం అలాంటి మనిషి కాదని చెబుతున్నారు. అలాగే సినిమా టికెట్ల విషయంలో కూడా బాలయ్య ఎప్పుడో చెప్పారని, కానీ పవన్ ఇప్పుడే నిద్ర లేచి హడావిడి చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

పవన్ ఒకసారి మాట్లాడి వదిలేయడమే కాదని, నిత్యం ఈ అంశాలపై పోరాటం చేయాలని అన్నారు. ఏదో ఒకసారి హడావిడి చేయడం వల్ల ఉపయోగం లేదని చెబుతున్నారు. పరోక్షంగా బాలయ్య గురించి మాట్లాడుకునే ముందు ఆలోచించుకుంటే బెటర్ అని అంటున్నారు.

Discussion about this post