హిందూపురం నియోజకవర్గం….డౌట్ లేకుండా తెలుగుదేశం పార్టీ కంచుకోట. టిడిపి ఆవిర్భవించాక ఇక్కడ మరొక పార్టీ గెలవలేదు. పైగా ఈ నియోజకవర్గం నందమూరి ఫ్యామిలీ అడ్డా…ఇక్కడ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణలు గెలిచారు. గత రెండు పర్యాయాల నుంచి బాలకృష్ణ విజయం సాధిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అయితే ఇప్పుడు హిందూపురంలో బాలయ్య పని అయిపోయిందని విమర్శలు మొదలయ్యాయి. అసలు బాలయ్యని ఓడిస్తామని వైసీపీ శ్రేణులు శపథం చేస్తున్నాయి.

పంచాయితీ ఎన్నికల్లో హిందూపురంలో వైసీపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. అలాగే హిందూపురం మున్సిపాలిటీని కూడా వైసీపీనే గెలుచుకుంది. తాజాగా ఎంపిటిసి, జెడ్‌పిటిసి స్థానాల్లో కూడా వైసీపీ హవా కొనసాగింది. జెడ్‌పిటిసి స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేస్తే…43 ఎంపిటిసి స్థానాల్లో వైసీపీ 36 గెలుచుకోగా, టిడిపి 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో హిందూపురంలో బాలయ్య సీన్ అయిపోయిందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతున్నారు.

దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బాలయ్య తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. అయితే ఇక్బాల్ చేసిన సవాల్‌పై టిడిపి శ్రేణులు కూడా గట్టిగానే స్పందిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బాలయ్య పై పోటీ చేసి ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు గెలవలేక ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇక పంచాయితీ, మున్సిపాలిటీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో ఎలా గెలిచారో జనం అందరికీ తెలుసని, ఈ విజయాలకే విర్రవీగితే ప్రజలే నెక్స్ట్ బుద్ధి చెబుతారని అంటున్నారు.

2019 ఎన్నికల ముందు అలాగే బాలయ్య పని అయిపోయిందని హడావిడి చేశారని, కానీ 2014 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారని గుర్తుచేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల్లో బాలయ్య మీద పోటీ చేసి గెలవండి అంటూ సవాల్ చేస్తున్నారు. ఏదేమైనా హిందూపురంలో బాలయ్యని ఓడించడం కష్టమే..!

Discussion about this post