వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రజల కోసం ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు గానీ, టీడీపీకి చెక్ పెట్టడానికి మాత్రం గట్టిగానే పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుకు ఏ మాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వకుండా వైసీపీ దూసుకెళుతుంది. ఇదే క్రమంలో చంద్రబాబు కంచుకోట కుప్పంతో పాటు టీడీపీకి ఉన్న పలు కంచుకోటలపై దృష్టి పెట్టి అక్కడ వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

ఇదే క్రమంలో కుప్పంలో వైసీపీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అక్కడ టీడీపీకి చెక్ పెట్టుకుంటూ వైసీపీ వస్తుంది. ఇప్పటికే పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ, తాజాగా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి చెక్ పెట్టి వైసీపీ జెండా ఎగరవేశారు. అయితే కుప్పంతో పాటు టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంపై కూడా వైసీపీ బాగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది.

ఇక్కడ బాలయ్యకు కూడా వైసీపీ సైలెంట్‌గా చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీనే పైచేయి సాధించింది. అలాగే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. ఇక హిందూపురం మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరింది. అంటే ఇక్కడ కూడా వైసీపీ పూర్తిగా డామినేట్ చేస్తూ వస్తుంది. తాజాగా హిందూపురం పరిధిలో చిలమత్తూరు జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ మండలంలో వైసీపీ పాగా వేసింది.

మొత్తం మీద హిందూపురంలో వైసీపీ ఆధిక్యం తెచ్చుకుంది. కానీ ఇవి స్థానిక ఎన్నికలు…ఇప్పుడు పూర్తిగా వైసీపీ ఆధిక్యం ఉందని అర్ధమవుతుంది. పైగా అధికార బలాన్ని ఉపయోగించుకుని వైసీపీ సత్తా చాటుతుంది. అయితే సాధారణ ఎన్నికలోచ్చేసరికి ఈ పరిస్తితి ఉండే అవకాశం లేదని.. అవన్నీ కలలు మాత్రమే అని తెలుస్తోంది. హిందూపురంలో బాలయ్యకు చెక్ పెట్టడం జరిగే పని కాదని తెలుస్తోంది. ఇప్పుడు స్థానికంలో గెలిచి వైసీపీ తాత్కాలిక ఆనందం పొందడమే.

Discussion about this post