బాలినేని శ్రీనివాస్ రెడ్డి..ఏపీ రాజకీయాల్లో కీలక నాయకుడు…ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో బలమైన నేత…ఒంగోలు నుంచి ఎక్కువసార్లు ప్రాతినిధ్యం వహించిన నాయకుడు. అయితే రాజకీయంగా పెద్దగా పరాజయాలు చూడని బాలినేనికి ఇప్పుడు ఒంగోలులో ఇబ్బందికర పరిస్తితులు కనిపిస్తున్నాయి. ఒంగోలులో బాలినేనికి తిరుగులేదనే సంగతి తెలిసిందే…1999 నుంచి తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్న నాయకుడు. 1999 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్నా సరే ఒంగోలు అసెంబ్లీ నుంచి బాలినేని కాంగ్రెస్ నుంచి గెలిచారు.

ఇక అదే ఊపుతో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు..అయితే వైఎస్సార్ చనిపోవడంతో బాలినేని…జగన్ వెంట నడిచారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు. ఇక 2012 ఉపఎన్నికలో విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో తొలిసారి బాలినేనికి ఓటమి ఎదురైంది. టీడీపీ నేత దామచర్ల జనార్ధన్ చేతిలో ఓడిపోయారు. కానీ అయిదేళ్లలోనే బాలినేని పుంజుకున్నారు..ఊహించని విధంగా 2019 ఎన్నికల్లో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

అలాగే జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఛాన్స్ దొరికింది…అయితే రెండున్నర ఏళ్లలో పదవి పోయింది. జగన్ మంత్రివర్గ ప్రక్షాళన చేయడంతో బాలినేనికి పదవి పోయింది. ఇక పదవి పోయాక ఎమ్మెల్యేగా…ఆయన గడప గడపకు తిరుగుతున్నారు. గడప గడపకు తిరుగుతున్న బాలినేనికి ప్రజల నుంచి ఊహించని స్పందన ఎదురవుతుంది. అది కూడా పాజిటివ్ లో కాదు…బాగా నెగిటివ్ లోనే. ఎలాగో మంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు లో బాలినేని చేసిన అభివృద్ధి పెద్దగా లేదు…ఇప్పటికీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుంది.

ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా చేస్తున్న కార్యక్రమాలు కనిపించడం లేదు…పైగా బాలినేని ప్రశ్నించిన వారిని వైసీపీ నేతలు వేధించే కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు బాలినేని అక్రమాలు ఎక్కువే అని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఒంగోలులో బాలినేనికి పాజిటివ్ కనిపించడం లేదు..ఈ సారి ఎన్నికల్లో బాలినేనికి ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి.

Discussion about this post