వైసీపీకి వీర విధేయులుగా ఉన్న నేతలంతా ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. మరి పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరగడం వల్ల జరుగుతుందా? లేక నేతలు అసంతృప్తిగా ఉన్నారా? అనేది క్లారిటీ లేదు..కానీ కీలమైన నేతలు పార్టీకి దూరమైపోతున్నారు. ఇప్పటికే జగన్‌కు వీర విధేయుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి లాంటి వారు దూరమయ్యారు. అటు ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీకి దూరం జరిగారు.

వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం అడ్రస్ లేరు. ఇప్పుడు జగన్ బంధువు, వైసీపీ పెద్ద నేతల్లో ఒకరుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం వైసీపీకి దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి తప్పించారో అప్పటినుంచి బాలినేని అసంతృప్తిగానే ఉంటున్నారు. ఇటీవల మార్కాపురంలో సిఎం సభ జరిగింది..అప్పుడు ప్రోటోకాల్ ఇష్యూతో బాలినేనికి ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో బాలినేని మరింత అలిగారు.

ఈ క్రమంలోనే తాజాగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పోస్టుకు రాజీనామా చేశారు. ఎంతమంది నేతలు బుజ్జగించిన బాలినేని వెనక్కి తగ్గలేదు. ఆఖరికి జగన్ ఎంటర్ అయ్యి..బాలినేనితో స్వయంగా మాట్లాడారు. మళ్ళీ పదవి చేపట్టాలని కోరారు. అయినా సరే పదవిని చేపట్టలేనని బాలినేని..జగన్‌కు చెప్పేశారు. దీంతో బాలినేని ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్ధమవుతుంది. ఇక ఈయన వైసీపీకి వీడ్కోలు కూడా చెప్పవచ్చని, అలాగే జనసేనలో చేరే ఛాన్స్ ఉందని ప్రచారం వస్తుంది.
కానీ ఇందులో నిజమెంత ఉందో క్లారిటీ లేదు. అదే సమయంలో ఇలా వైసీపీకి విధేయులుగా ఉన్నవారంతా ఆ పార్టీకి దూరమై..టిడిపి లేదా జనసేనలో చేరి కోవర్టు ఆపరేషన్ చేస్తారనే ప్రచారం వస్తుంది. ఆ పార్టీల్లో చేరి ఎన్నికల్లో గెలిచి..మళ్ళీ వైసీపీలోకి జంప్ చేసి..ఈ పార్టీలకు డ్యామేజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరి ఈ కోవర్టు ఆపరేషన్ లో నిజమెంత ఉందో చూడాలి.